BigTV English

Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ విజయవంతం

Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ విజయవంతం
Sadhguru Jaggi Vasudev
Sadhguru Jaggi Vasudev

Sadhguru Jaggi Vasudev: ప్రముఖ ఆద్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈనెల 17వ తేదీన ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు స్కానింగ్ చేసిన వైద్యులు.. అతని బ్రెయిన్ లో కొంత తేడాను గమనించారు. బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించిన డాక్టర్స్.. అదే రోజు ఆయనకు శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు. ఆ సర్జరీ విజయవంతంగా పూర్తి అయినట్లు వైద్యులు తాజాగా ప్రకటించారు.


సద్గురు గత కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పి కారణంగా వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయగా.. మెదడులో తీవ్ర రక్తస్రావం అయినట్లు గుర్తించారు. పరిస్థితి మరింత విషమించముందే ఆయనకు ఈనెల 17న శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యుల బృందం అధికారిక బుల్ టెన్ విడుదల చేసింది. ఈ వైద్య బృదంలో డాక్టర్ వినీత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగిలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన హెల్త్ పారామీటర్లు మెరుగుపడుతున్నట్లు తెలిపారు. 66 ఏళ్ల వయస్సులో కూడా ఆయన త్వరగానే కోలుకుంటున్నారని పేర్కొన్నారు.

 


Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×