BigTV English

PM Modi: ప్రజాస్వామ్యం గెలిచింది: ప్రధాని మోదీ

PM Modi: ప్రజాస్వామ్యం గెలిచింది: ప్రధాని మోదీ

PM Modi on Lok sabha election results(Political news telugu): పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టబోతున్నదన్నారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరూ గౌరవించేలా ఉందని తెలిపారు.


సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ మంచి మెజారిటీ సాధించిందని తెలిపారు. 1962 తర్వాత ఏ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాలేదని అన్నారు. జమ్మూకశ్మీర్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చారని అన్నారు.

సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేశామనని తెలిపారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరు గర్వించేలా ఉందని తెలిపారు. ఒడిశాలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయబోతుందని అన్నారు. కేరళలో కూడా ఒక్క సీటు గెలుచుకున్నాం అని తెలిపారు.


Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×