BigTV English

Rains in Tamil Nadu: వరద నీటిలో బ్రిడ్జి కింద చిక్కుకున్న దివ్యాంగుడు..!

Rains in Tamil Nadu: వరద నీటిలో బ్రిడ్జి కింద చిక్కుకున్న దివ్యాంగుడు..!

Rains in Tamil Nadu: అక్కడ భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమితో ప్రజలు  ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో సడెన్ గా ఆకాశం మేఘావృతమైంది. ఆ వెంటనే చినుకులు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. దీంతో కాలనీలు, లోతట్టుప్రాంతలన్నీ జలమయమయ్యాయి. ఎటు చూసినా వరద నీరు ముంచెత్తుతుంది. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇది చూసిన అక్కడి ప్రజలు వారికి ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగినా భిన్నవాతావరణం చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.


తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎక్కడ చూసినా వరద నీటితో నిండిపోయి కనబడుతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో అక్కడ చెట్లు విరిగిపడి రోడ్లపై పడ్డాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి.

ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్నారు స్థానిక జనం. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురవడంతో తమిళనాడులోని అన్నానగర్, తెప్పకుళం, గోరిప్పాళెయం, కేకే నగర్ తోపాటు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. సెల్లూరు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఆ వరద నీటిలో ఓ దివ్యాంగుడు చిక్కుకుపోయాడు. ఇది గమనించిన పలువురు స్థానిక అధికారులకు విషయం చేరవేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని కాపాడారు. పలు చెట్లు విరిగి మీద పడడంతో పలువురు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా పంట నష్టపోయినట్లు తెలుస్తోంది.


Also Read: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి

అయితే, వాతావరణ శాఖ మాట్లాడుతూ.. పలు జిల్లాలో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల భారీ వర్షం కురిసిందని పేర్కొన్నది. ఉపరితన ఆవర్తనం కారణంగా వేసవి వానలు కురవడం ప్రారంభమయ్యాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా వైగై నదికి నీటి రాక పెరగడంతో సంబంధిత అధికారులు తీర ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×