Road Accident In West Bengal: పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురూలియా జిల్లాలో శనివారం పలు వాహనాలను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్ తరలిస్తున్న ట్రక్కు మొదట బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
వెంటనే డ్రైవర్ ను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దాంతో త్రీ వీలర్ ను ట్రక్కు మరో సారి ఢీ కొట్టింది. ఆ తర్వాత పాద చారులను ఢీ కొన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నితుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో సద్వాడి మోడ్ ప్రాంతంలో నివసించే కొందరు వగర్దంగా గ్రామంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే..భమురియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్యామపాడ్ (74), భాగ్యవతి మండల్ (63),మృదుల్ మండల్ (45). ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలవగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలు నిలిపివేత
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ట్రక్కును వెంబడించి పర్వేలియా గ్రామం వద్ద ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.