BigTV English

PM Modi: NDA-‘న్యూఇండియా డెవలప్‌మెంట్ యాస్పిరేషన్’.. విపక్ష కూటమికి మోదీ స్ట్రాంగ్ కౌంటర్..

PM Modi: NDA-‘న్యూఇండియా డెవలప్‌మెంట్ యాస్పిరేషన్’.. విపక్ష కూటమికి మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
pm modi speech

PM Modi news today live(Politics news today India): కొత్తగా ఏర్పడిన I-N-D-I-A కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. చిన్న చిన్న స్వార్థాలతో.. సిద్దాంతాలను పక్కనపెట్టి వారంతా ఒక్కటవుతున్నారని ఆరోపించారు. వ్యతిరేక భావనలతో ఏర్పడే కూటమిలు మనుగడ సాధించలేవని అన్నారు.


కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోట్లాడుకుంటూ.. బెంగళూరులో ఆ రెండు పార్టీల నేతలు చేతులు కలిపి నవ్వుతున్నారని తప్పుబట్టారు. బెంగాల్‌లో కాంగ్రెస్, కామ్రేడ్లపై దాడులు చేస్తున్న టీఎంసీ.. సైతం ఒక్కటవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కశ్మీర్‌లోనూ రెండు పార్టీలు సైతం ఇలానే చేస్తున్నాయని విమర్శించారు. ఆ కూటమి మోదీ కోసం కాకుండా.. దేశం కోసం, పేదల కోసం ఆలోచిస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మోదీ.

దేశంలో స్థిరత్వం కోసమే ఎన్డీయే కూటమి ఏర్పడిందని.. 25 ఏళ్ల నుంచి దేశ ప్రజల సేవలో ఉందని చెప్పారు. ఎన్డీయే ఏర్పాటులో వాజ్‌పేయీ, అద్వానీలదే కీలక పాత్ర అన్నారు. ఎన్డీయేలో చిన్నా, పెద్దా పార్టీలనే తేడా లేదని తెలిపారు. మూడోసారి కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని పబ్లిక్ ఫిక్స్ అయ్యారని స్పష్టం చేశారు. ఎన్డీఏతో కలిసి రావాలనుకునే పార్టీలను స్వాగతిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. NDA అంటే న్యూఇండియా డెవలప్‌మెంట్ యాస్పిరేషన్ ఆఫ్ పీపుల్ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు.


Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×