Big Stories

PM Modi on Rahul & Akhilesh: వద్దని చెప్పినా వాళ్లు మళ్లీ వస్తున్నారు: పీఎం మోదీ!

PM Modi Fire on Rahul Gandhi and Akhilesh Yadav: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. గత ఎలక్షన్లలో ప్రజలు వారిని తిరస్కరించినా.. వారు మళ్లీ తమకు ఓటు వేయాలంటూ ప్రజల ముందుకు వస్తున్నారంటూ ఆయన అన్నారు. యూపీలోని అమ్రోహాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

ప్రతిపక్షాలు బీజేపీపై దాడి చేసి.. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపుల బుట్టను మోస్తున్నాయని మోదీ ఆరోపించారు. ప్రజలు తమ పార్టీవైపే ఉన్నారంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు సమాద్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పై మోదీ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

ఇటీవల రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని వారు అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయ్యిందని, అదేవిధంగా తమతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయన్నారు. ఖచ్చితంగా అత్యధికంగా సీట్లు గెలుచుకుంటామని ఆయన అన్నారు.

Also Read: కేజ్రీవాల్ హెల్త్‌పై పిటిషన్.. షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు..!

అయితే, యూపీలో మొత్తం 63 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇటు కాంగ్రెస్ పార్టీ 17 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే, గత పార్లమెంటు ఎలక్షన్లలో కూడా సమాద్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అయితే, ఎక్కువ సీట్లు సాధించలేకపోయాయి. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత అసెంబ్లీ ఎలక్షన్స్ అనంతరం ఆయనను ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News