BigTV English

Arvind Kejriwal Health Petition: కేజ్రీవాల్ హెల్త్‌పై పిటిషన్.. షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు..!

Arvind Kejriwal Health Petition: కేజ్రీవాల్ హెల్త్‌పై పిటిషన్.. షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు..!

Arvind Kejriwal’s Health Petition Adjourned by Court: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న తలకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నందున ఇంజక్షన్లు ఇవ్వాలంటూ కోర్టును పిటిషన్ దాఖలు చేశారు.


ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని.. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఇంజక్షన్లను ఇవ్వాల్సిందిగా కేజ్రీవాల్ కోర్టును కోరారు. అయితే ఇరువురు వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా.. ఏప్రిల్ 14 నాటికి ఆయన షుగర్ లెవల్స్ 276 ఎంజీ/డీఎల్ గా నమోదైంది. దీనికారణంగా తన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నందున వైద్యుడ్ని కలిసే అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. అయితే గురువారంలో కోర్టులో విచారణ జరగగా.. ఈడీ కేజ్రీవాల్ పై పలు ఆరోపణలు చేసింది.


Also Read: 22 మంది సంపన్నుల చేతుల్లో దేశ సంపద.. ఇక సూపర్ ఎలా?.. రాహుల్ గాంధీ

కేజ్రీవాల్ కు జైలులో ఇంటి భోజనానికి అనుమతి ఉన్నందున.. ఆయన నచ్చిన ఆహారం తిని షుగర్ లెవల్స్ ను పెంచుకుంటున్నారని ఈడీ కోర్టులో విమర్శించింది. ఆరోగ్య పరమైన సమస్యలను చూపించి.. కేజ్రీవాల్ బెయిల్ పొందడానికి చూస్తున్నారని ఈడీ తరఫు న్యాయవాది ఆరోపించారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ డైలీ తీసుకునే డైట్ వివరాలు ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

అయితే ఈడీ అధికారులు చేసిన ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. మధుమేహ రోగులకు సిఫారసు చేసే కృత్రిమ చక్కెరను మాత్రమే కేజ్రీవాల్ జైలులో వినియోగిస్తున్నారని, దీనిపై ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వెల్లడించింది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×