BigTV English

Koneru Konappa: హస్తం గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..? బీఎస్పీతో పొత్తే కారణమా..?

Koneru Konappa: హస్తం గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..? బీఎస్పీతో పొత్తే కారణమా..?

koneru Konappa Ex MLA Koneru Konappa likely to Quit BRS(Telangana politics): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం రంజుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ బీఎస్పీ అధినేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే పలువురు నేతలు కారు పార్టీని వీడి అటు హస్తం గూటికి.. ఇటు కమలం గూటికి చేరుకున్నారు.


బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తును బీఆర్ఎస్ సొంత నేతలే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత.. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఎస్పీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని కారు పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్న కోనేరు కోనప్ప ఇవ్వాళ హైదరాబాద్‌లో సిర్పూర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్‌ను వీడటానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా బుధవారం సాయంత్రం లోగా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసిన కోనేరు కోనప్ప.. బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత కారు పార్టీలో చేరిన కోనప్ప 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సిర్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుపై 24,036 ఓట్ల మెజార్టీతో గెలిచారు.


Read More: కారు – ఏనుగు పొత్తు ఫలించేనా..? నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..?

వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్పకు 2023 ఎన్నికల్లో షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు చేతిలో ఓడిపోయారు. కాగా ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.

దిగిపోతున్న నేతలతో కారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒక పక్క ఎంపీ అభ్యర్థులు కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందుకే బీఎస్పీతో పొత్తు పెట్టుకుందనే ప్రచారం జోరందుకుంది.

Tags

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×