Big Stories

Manipur Poll Violence: మణిపూర్ కాల్పుల ఘటన.. ముగ్గురు అరెస్ట్

Violence breaks out: లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న మొదటి విడతగా 21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, మణిపూర్ లో పలు చోట్లా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇంకొన్ని చోట్ల కాల్పులు, మరికొన్ని చోట్లా ఈవీఎంలను కాలబెట్టడం, పగులగొట్టడం వంటివి చేశారు.

- Advertisement -

బిష్ణుపులోని మొయిరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని థమ్నాపోక్పి పోలింగ్ కేంద్రం దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇంపాల్ ఈస్ట్ జిల్లా మోయిరంగ్ కాంపూ సాజెబ్ లోని పోలింగ్ బూత్ వద్ద పలువురు దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. ఖోంగ్ మాన్ జోన్ 4 పోలింగ్ స్టేషన్ లో ఓటర్లు, సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈవీఎంలు కాలిపోయాయి. ఇంకొన్ని ధ్వంసమయ్యాయి.

- Advertisement -

Also Read…అగ్ని ప్రమాదాల్లో.. భారీ ఆస్తి నష్టం ?

అయితే, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో కాల్పుల ఘటనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. వారు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని మోయిరంగ్ కాంపూ సాజెబ్ వద్ద కాల్పుల ఘటనలో పాల్గొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్, మందుగుండు సామాగ్రి, రూ. 15 లక్షల నగదును స్వాధీనం చెసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News