Flight Journey: చాలా మందికి విమాన ప్రయాణం అనేది ఒక కల. జీవితంలో ఒక్కసారైన విమానం ఎక్కాలని భావిస్తుంటారు. ఎందుకంటే, విమాన ప్రయాణం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని అందరూ భావిస్తారు. వేలకు వేలు ఖర్చును భరించే శక్తి ఉంటే తప్ప విమానం ఎక్కలేం అనుకుంటారు. కానీ, అందులో ఏమాత్రం వాస్తవం లేదని నిరూపిస్తున్నాయి పలు విమానయాన సంస్థలు. తాజాగా ఎయిర్ ఇండియా సంస్థ కేవలం రూ. 1,444కే విమాన టికెట్ అందించగా, మరో సంస్థ కేవలం రూ. 800కే విమాన ప్రయాణాన్ని అందిస్తోంది. అంత తక్కువ ధరలో విమాన ప్రయాణం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..
కొచ్చి- సేలం టికెట్ ధర కేవలం రూ. 800
సరసమైన ధరలో విమానం ఎక్కాలనుకునే వారికి మంచి అవకాశం. వెంటనే కొచ్చి నుంచి సేలం వరకు విమాన టికెట్ బుక్ చేసుకోండి. ముందస్తుగా ఈ రూట్ లోబుక్ చేసుకుంటే రూ. 1000 కంటే తక్కువ ధరలో టికెట్ లభిస్తున్నది. తేవారలోని సేక్రేడ్ హార్ట్ కాలేజీకి చెందిన విద్యార్థి శ్రీహరి రాజేష్ ఇటీవల కొచ్చి నుంచి సేలంకు విమానంలో వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కేవలం 6 రోజుల్లోనే వీడియో 7.8 మిలియన్ల వ్యూస్ అందుకుంది. శ్రీహరి ‘కేవలం రూ. 800కి విమాన ప్రయాణం’ అనే క్యాప్షన్ తో రీల్ ను పోస్టు చేశారు. అతడు చెప్పింది నిజమో? కాదో? అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ రూట్ లో ఆన్ లైన్ లో విమాన టిక్కెట్ ను బుక్ చేసుకోవడానికి ట్రై చేశాం. వన్ సైడ్ టికెట్ అసలు ధర రూ. 1,050. డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.770కే అందుబాటులోకి వచ్చింది. మీరు కొద్ది వారాల ముందు టికెట్ బుక్ చేసుకుంటే రూ. 770 కంటే తక్కువ ధరలకే టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: సీ ప్లేన్‌లో మున్నార్‌కూ చెక్కేయొచ్చు, ఇదిగో ఇలా..
సేలంలో చూడాల్సి ప్రదేశాలు ఏంట?
సేలంలో చూడాల్సింది పర్యాటకు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? అని చాలా మంది ఆలోచిస్తారు. శ్రీహరి తన వీడియోలో ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చాడు. ఇక్కడి నుంచి తమిళనాడులోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటైన ఏర్కాడ్‌కి బస్సులో చేరుకోవచ్చు. బస్సులో కేవలం గంటలో అక్కడికి వెళ్లొచ్చు. ఏర్కాడ్ ను ‘పూర్ మ్యాన్స్ ఊటీ’గా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్‌లో అందమైన కాఫీ, నారింజ తోటలు ఉన్నాయి. ఇది తూర్పు కనుమలలోని సర్వారాయన్ కొండలపై ఉంది. ఇది దేశంలోని చౌకైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. లేడీస్ సీట్ వ్యూ పాయింట్ ఇక్కడ అత్యంత అద్భుతమైన ఆకర్షణ. ఇక్కడి నుంచి, లోయలోని సేలం పట్టణం, మెట్టూర్ డ్యామ్ అందాలను ఆస్వాదించవచ్చు. బొటానికల్ గార్డెన్, కిల్లియూరు జలపాతాలు, ఏర్కాడ్ సరస్సు, కేవలం 3 కి.మీ దూరంలో షేర్వరాయన్ దేవాలయం, పగోడా పాయింట్, సిల్క్ ఫామ్, గులాబీ తోటను కూడా చూసి ఆనందించవచ్చు.
Read Also: జస్ట్ 1,444కే విమాన ప్రయాణం.. ఎయిర్ ఇండియా బంఫర్ ఆఫర్!