E-Paper
Advertisement

Ambedkar : బీఆర్‌ అంబేడ్కర్‌ కు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి..!

Ambedkar : బీఆర్‌ అంబేడ్కర్‌ కు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి..!
Advertisement

Ambedkar : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 64వ వర్థంతిని దేశవ్యాప్తంగా మహా పరినిర్వాన్‌ దివస్‌గా నిర్వహిస్తున్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను పలువురు రాజకీయ నాయకులు గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాళులు అర్పించారు. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ లక్షల మందిలో ఆశలు చిగురించేందుకు శ్రమించారని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌ ఎన్నటికీ మర్చిపోలేని ఆదర్శప్రాయమైన రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు.

Advertisement

స్పీకర్‌ ఓం బిర్లా అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ ఉండేలా ప్రజాస్వామ్య సాధికారతకు అవసరమైన అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే , అధిర్‌ రంజన్‌ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కు నివాళిగా మహాపరినిర్వాన్ దివస్ జరుపుకుంటున్నారు.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×