BigTV English

Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day : దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజాస్వామ్యం పాశ్చాత్య విధానాలతో పోలిస్తే ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అందుకే భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారన్నారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని ఆమె తెలిపారు. భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణా అవకాశం ఉందన్నారు. రాష్ట్రపతి ముర్ము 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించారు.

Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day : దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజాస్వామ్యం పాశ్చాత్య విధానాలతో పోలిస్తే ఎంతో పురాతనమైందనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అందుకే భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారన్నారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని ఆమె తెలిపారు. భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణా అవకాశం ఉందన్నారు. రాష్ట్రపతి ముర్ము 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించారు.


ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రస్తావించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడమే కాకుండా సంక్షేమం అనే ఆలోచనను పునర్నిర్వచించిందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో దేశ వ్యాప్తంగా పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను కేంద్రప్రభుత్వం పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికి ఈ పథకం కొనసాగిస్తోన్నట్లు ఆమె తెలిపారు. జాతీయ విద్యా విధానంలో నూతన మార్పులు, ఆయుష్మాన్‌ భారత్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిందని ప్రకిటించారు. భారత్ అంతరిక్ష పరిశోధనలో సాధించిన ప్రగతిని ఆమె కొనియాడారు. దేశంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రస్తావించారు.

అనేక ఏళ్ల న్యాయ ప్రక్రియ, అత్యున్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభం అయిందన్నారు. రామ మందిరం చరిత్రలో గొప్ప మందిరంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలే కాకుండా న్యాయప్రక్రియపై పౌరులకు ఉన్న ఎనలేని నమ్మకానికి నిదర్శనంగా నిలచి ఉంటుందన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కొనసాగుతోన్న ఘర్షణలను రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. మహాత్మాగాంధీ, అశోకుడు బోధనలను గుర్తు చేశారు. వారు బోధించిన బోధనలే శాంతియుత సమాజాన్ని ఏర్పరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి టెక్నాలజీ మనుఘల జీవన విధానంలో భాగం అవుతాయని రాష్ట్రపతి వెల్లడించారు. అయితే మానవాళికి భవిష్యత్తులో ఇవి ఆందోళన కలిగించే అంశాలు అని తెలిపారు. అయితే వీటి వల్ల భవిష్యత్‌లో యువతకు అద్భుతమైన అవకాశాలు కలుగుతాయన్నారు. గత కొద్ది కాలంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలో భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వెల్లడించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×