SSMB 29:ప్రియాంక చోప్రా.. బంతిని నేలకు ఎంత వేగంగా విసిరితే.. రెట్టింపు వేగంతో వెనక్కి వచ్చినట్టు.. బాలీవుడ్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఆ తర్వాత హాలీవుడ్ కి వెళ్లిపోయి స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేయడానికి ఇప్పుడు ఇండియన్ దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక చోప్రా ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) సినిమాలో భాగమైంది. అందులో భాగంగానే ఇటీవల హైదరాబాదులో చిలుకూరు బాలాజీ టెంపుల్ లో దర్శనమిచ్చిన ఈమె, తెలుగు ప్రజలతో మమేకమౌతూ ఇక్కడ తన స్టేటస్ ను తిరిగి పొందే ప్రయత్నం చేస్తోంది.
ఎస్ఎస్ఎంబి-29లో భాగమైన ప్రియాంక చోప్రా..
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలసి సృష్టించబోతున్న ఒక కొత్త ప్రపంచం (SSMB 29)లోకి ప్రియాంక చోప్రా అడుగు పెట్టేసింది. ఇక దీనికి తోడు నిన్నటికి నిన్న రాజమౌళి సింహాన్ని బోనులో పెట్టి, లాక్ చేసి పాస్ పోర్ట్ లాగేసుకున్నట్టు ఒక వీడియో షేర్ చేశారు. దీంతో మహేష్ బాబును లాక్ చేసి, ఇకపై ఆయన వెకేషన్స్ కి వెళ్లకుండా సినిమా షూటింగుకు తీసుకు వెళ్ళనున్నట్లు సూచించారు కూడా..దీనికి మహేష్ బాబు కూడా ‘ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను’ అంటూ కామెంట్ కూడా చేశారు. అటు ప్రియాంక చోప్రా కూడా “ఫైనల్లీ” అంటూ కామెంట్ పెట్టింది. ఇక ఇలా వీరి ముగ్గురు ఈ సినిమాలో భాగమైనట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం.. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతోంది అనే విషయం వైరల్ గా మారుతోంది.
ఆశ్చర్యపరుస్తున్న ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్..
అసలు విషయంలోకెళితే, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా.. అక్కడ ఒక్కో సినిమాకు దాదాపు రూ.45 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందట. ఇక అందుకే ఇప్పుడు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ.80 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ఆయన శంకర్ (Shankar) దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ కోసం రూ.65 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. మరి ప్రియాంక చోప్రా డిమాండ్ చేసింది కానీ రాజమౌళి మాత్రం ఆమె రెమ్యూనరేషన్ ను రూ. 30 కోట్లకు కుదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంది కాబట్టి ఆమె ఆ రేంజ్ లో డిమాండ్ చేయడంలో తప్పులేదు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగు కూడా ప్రారంభం కానుంది.