PM Modi podcast : ప్రధాని మోదీ(pm modi) నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఉంటారు. సోషల్ మీడియాను రాజకీయాల్లో మోదీ వాడినట్లుగా మరే నాయకుడు వాడి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మోదీ.. ఇప్పుడు పాడ్ కాస్ట్ ద్వారా మరోమారు నెటిజన్ల ముందుకు వచ్చారు. తనకు ఇది తొలి అనుభవమని, ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదంటూనే.. అనేక ముఖ్యమైన విషయాలపై తన స్పందనను తెలియజేశారు. ఇప్పుడు… ఈ పాడ్ కాస్ట్ వీడియో వైరల్ గా మారింది.
ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహిస్తోన్న ‘పీపుల్ బై డబ్ల్యుటీఎఫ్’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌లో ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలం, భారత టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, సోషల్ మీడియా, పాలిటిక్స్, సహా అనేక అంశాలపై లోతుగా చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు ఉన్న ఈ పాడ్ కాస్ట్ తాజాగా విడుదలైంది. ఇందులోని అంశాలు ప్రధానిని గతానికి భిన్నంగా చూపించింది అంటున్నారు నెటిజన్లు.
తొలుత ఈ పాడ్ కాస్ట్ కు సంబంధించిన వీడియోను నిఖిల్ కామత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ సైతం పాడ్ కాస్ట్ ట్రైలర్‌ను తన ట్వట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అందులో.. గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఊన్న సమయంలో చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యాల గురించి చర్చించుకున్నారు. అందులో భాగంగా.. తాను మనిషినేనని, పొరపాట్లు జరుగుతాయని, తానేదీ దేవుడిని కాదంటూ వ్యాఖ్యానించారు.
చాలా కుటుంబాల్లో రాజకీయాలపై చెడు అభిప్రాయంతో ఉంటారు. దానిని మార్చడం అసాధ్యం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటని కామత్ ప్రశ్నించారు. దానికి అంగీకరించిన ప్రధాని మోదీ.. రాజకీయాల్లోకి యువతో పాటు మంచి వ్యక్తులు కూడా రావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని, సొంత లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు కాదని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి ప్రసంగాలు, వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని పొరపాట్లు చేసినట్లు అంగీకరించారు. అయితే.. తనతో పాటు అందరూ తప్పులు చేస్తారని, తాను దేవుడిని కాదని వ్యాఖ్యానించారు. అయితే.. తాను ఎలాంటి చెడు ఉద్దేశ్యంతో తప్పులకు పాల్పడను అని మాత్రం గట్టిగా చెప్పగలను అని అన్నారు. తనకు తెలియకుండానే.. తప్పులు జరిగే అవకాశాలున్నాయని అన్నారు.
An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch… https://t.co/5Q2RltbnRW
— Narendra Modi (@narendramodi) January 10, 2025