BigTV English

PM visit to Kerala: కేరళలో ప్రధాని పర్యటన.. రూ. 4,000 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభం..

PM visit to Kerala: కేరళలో ప్రధాని పర్యటన.. రూ. 4,000 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభం..

Prime Ministers visit to Kerala


Prime Ministers visit to Kerala: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఆయన కేరళతో పాటు తమిళనాడులో పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  కేరళలోని కొచ్చిలో రూ. 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద 310-మీటర్ల పొడవు గల న్యూ డ్రై డాక్ ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, పుతువైపీన్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.


ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు, భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారుతున్నప్పుడు, దేశ సముద్ర బలాన్ని పెంచడంపై దృష్టి పెడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు దేశంలోని దక్షిణ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.

దీంతో తిరువనంతపురం పోలీసులు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. అంతర్జాతీయ టెర్మినల్‌కు వెళ్లే వారు వెంపాలవట్టం, చక్కా ఫ్లై ఓవర్, ఈంచక్కల్ వద్ద ఉన్న అనంతపురి హాస్పిటల్ సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లాలని తెలిపారు.

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×