BigTV English

Farmer Protest Suicide: శంభు బార్డర్ వద్ద రైతుల నిరసనల్లో అన్నదాత ఆత్మహత్య.. మూడు వారాల్లో రెండో ఘటన

Farmer Protest Suicide: శంభు బార్డర్ వద్ద రైతుల నిరసనల్లో అన్నదాత ఆత్మహత్య.. మూడు వారాల్లో రెండో ఘటన

Farmer Protest Suicide| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పంజాబ్ రైతులు చేస్తున్న నిరసనల్లో ఒక రైతు శంభు బార్డర్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో నిరసనలు చేయడానికి వెళుతున్న రైతులను హర్యాణా పోలీసులు.. పంజాబ్, హర్యాణా రాష్ట్రాల మధ్య శంభు బార్డర్ వద్ద నిలువరించారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో శంభు బార్డర్ వద్ద 55 ఏళ్ల ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడు వారాల్లో ఇది రెండో ఆత్మ హత్య. ఇంతకు ముందు కూడా ఓ రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు.


జాతీయ మీడియా కథనం ప్రకారం.. పంజాబ్ రాష్ట్రంలోని తరన్ తారన్ జిల్లాలోని పహువిండ్ గ్రామానికి చెందిన రేషం సింగ్ (55), రైతుల నిరసన కేంద్రం వద్ద ఉన్న లంగర్ (వంట చేసే ప్రాంతం)లో రేషం సింగ్ విషం తాగాడు.. ఆ తరువాత ఆయనను పటియాలాలోని రాజింద్ర హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రిలో రేషం సింగ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. 11 నెలలుగా పంజాబ్ రైతులు శంభు బార్డర్, ఖనౌరీ బార్డర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తూ దాని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

కానీ ప్రభుత్వం నిరసనలు చేస్తున్న రైతులను పట్టించుకోవడంలేదు. పైగా వారు ఢిల్లీ వద్దకు చేరి నిరసన చేయాలన్న హర్యాణా బార్డర్ వద్దే అడ్డగించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులతో చర్చలు చేపడుతుందని కేంద్ర మంత్రులు చెబుతున్నా.. అది జరగడం లేదు. దీంతో మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడానికే రైతు రేషం సింగ్ తన ఆత్మహుతి ఇచ్చారని రైతు నాయకుడు తేజ్ వీర్ సింగ్ మీడియాకు చెప్పారు. ఆయన వంటశాల వద్ద సుల్ఫాస్ పురుగులమందు తాగి చనిపోయాడని తెలిపారు.


Also Read:  ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..

మరోవైపు ఖనౌరీ బార్డర్ వద్ద రైతు నాయకుడు 70 ఏళ్ల జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నవంబర్ 26 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దల్లేవాల్ నిరాహార దీక్షకు మద్దతుగా మరో రైతు డిసెంబర్ 14న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ వద్దకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం తమకు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆ రైతు ప్రాణత్యాగం చేశాడు.

ఈ క్రమంలో నిరసను చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. “నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు దల్లేవాల్ కు ప్రాణాలు పోతే .. పరిస్థితులు అదుపుతప్పుతాయి.. అందుకు కేంద్రం తగిన ఫలితం అనుభవిస్తుంది.” అని రైతు నాయకుడు అభిమన్యు కోహర్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీక్ష చేపట్టిన దల్లేవాల్ పరిస్థితి గత వారం రోజులుగా విషమంగా ఉంది. ఆయన వైద్య చికిత్స చేయించుకునేందుకు సహకరించడం లేదని పటియాలా డిఐజి మందీప్ సింగ్ సిద్ధు చెప్పారు. ఈ అంశంపై పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ స్పందిస్తూ.. దల్లేవాల్ తో ప్రధాని మోదీ ఒకసారి మాట్లాడాలని కోరారు. “దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పంజాబ్ ప్రభుత్వం చింతిస్తోంది. అందుకే ప్రధాని మంత్రికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించుకుంటున్నాను. వారు దల్లేవాల్ తో ఒకసారి చర్చలు జరపాలి. ఫోన్ లో అయినా సరే ప్రధాన మంత్రి ఒకసారి మాట్లాడితే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. పంజాబ్ సరిహద్దులు కూడా మళ్లీ తెరుచుకుంటాయి. ఈ నిరసనలతో సాధారణ ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు.” అని ఆయన అన్నారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×