BigTV English

Satyabhama Today Episode : సత్యకు దిమ్మతిరిగే షాక్.. విశ్వనాథంకు తప్పిన ప్రమాదం..

Satyabhama Today Episode :  సత్యకు దిమ్మతిరిగే షాక్.. విశ్వనాథంకు తప్పిన ప్రమాదం..

Satyabhama Today Episode January 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. బైరవికి జయమ్మ షాక్ ఇస్తుంది ఆ షాక్ లోంచి తేరుకొక ముందే సత్యా కౌంటర్లు వేస్తుంది. సత్య మాటలు విన్న రుద్ర కోపంతో రగిలిపోతాడు. ఆ చేయిని వదిలిపెట్టదు మామయ్య వదిలిపెడితే మరోసారి జైలుకు వెళ్లాల్సి వస్తుందని రుద్రకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది సత్య. ఇక సత్య పడుకొని కలలు కంటుంది. నామినేషన్స్ కి అందరూ వచ్చి సంతకం పెట్టినట్లు సంతోష పడుతుంది. నిద్రలో లేచి చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తుంది. క్రిష్ లేచి ఏమైంది సత్య అని అడుగుతాడు.. నాకు మంచి కల వచ్చింది క్రిష్. నా నామినేషన్ మీద నా పుట్టింటి వాళ్లతో పాటు అత్తయ్య కూడా సంతకం చేశారు. దానికి ఏంటి మా అమ్మనా అయితే కచ్చితంగా అది పీడ కలనే. డౌటే లేదు. నీ కల నిజం కావాలి అని సరదాగా అయినా అనొచ్చు కదా సంతోషపడతాను. నీ పుట్టింటి వాళ్లు అంటే ఓకే కానీ మా అమ్మ సంతకం చేయడం అంటే చిన్న ముచ్చటనా అని క్రిష్ ఎగతాళి చేస్తాడు. మీ పుట్టింటోళ్లు సంతకం చేసారంటే ఓకే కానీ మా అమ్మ సంతకం చేసింది అంటే మీడియా పాకిస్తాన్ కలిసిపోయినట్లే లెక్క అని అంటాడు. ఏమైనా కాసేపు సంతోషపడనివ్వవా అని సత్య అడుగుతుంది. నీ కలే ఏమోగాని నా కలను చెడగొట్టావు అని అంటాడు. నువ్వేం కలగన్నావ్ అనేసి అంటుంది సత్య. మంచి కళ అని చెప్పబోతుంటే అక్కడ కూడా చెడు కలలేనా అనేసి సత్య అంటుంది. సత్యకు సపోర్ట్ చేస్తు వృద్దులు వస్తారు. అది విన్న మహదేవయ్య ఎంత కొన్నావని విడ్డూరంగా మాట్లాడతాడు. ఇక రేణుక కూడా సపోర్ట్ చేస్తానని రావడంతో రుద్ర అరుస్తాడు. రుద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు క్రిష్.. ఇక రుద్ర మహదేవయ్య కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ లోని ముసలి వాళ్ళను ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం సత్య దగ్గరికి రేణుక వస్తుంది. ఇంట్లో వాళ్ళు రాక్షసుల సత్య వాళ్ళు ఏదైనా చేస్తారని నాకు భయంగా ఉంది. ఏమైంది అక్క నిన్ను ఏమైనా అంటున్నారని సత్య అంటుంది. నా గురించి నేను భయపడట్లేదు సత్య ఆ వృద్ధాశ్రమంలోని పెద్ద వాళ్ల గురించి భయపడుతున్నాను వాళ్ళని ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు నువ్వు వెళ్లి వాళ్ళని వెంటనే కాపాడాలని అంటుంది. దాంతో సత్య భయపడిపోయి కృష్ణ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. వృద్ధాశ్రమానికి తీసుకెళ్లమని నిజాలు నీకే తెలుస్తాయి అని అంటుంది. రేణుక దగ్గరకు రుద్ర వచ్చి కూర్చొని అక్కడి నుంచి సత్యకి కాల్ చేస్తాడు.. రేణుక చెప్పడంతో నీ మొగుడిని వెంటేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లావు మరి ఇక్కడ ఉన్న మీ నాన్న సంగతి ఏంటి అని రుద్రా అంటాడు. నాన్నని ఏసేయడానికి ప్లాన్ చేశాను దాన్ని ఎవరు కాపాడతారని అనగానే సత్య షాక్ అవుతుంది. కార్ ని పక్కకుమని కృష్ణ అడుగుతుంది. కార్ ఆపగానే మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు అనేసి అంటుంది. ఇకనుంచి మీ నాన్న దగ్గరికి వెళ్లాలంటే ఒక గంట పడుతుంది మరి వెళ్దామా అని క్రిష్ అంటాడు. ఇక సత్య హర్షి కి ఫోన్ చేసి నాన్న ప్రమాదంలో ఉన్నాడని కాపాడమని చెప్తుంది. క్రిష్ సత్య ఇద్దరు వృద్ధాశ్రమానికి వెళ్తారు.

ఇంతలో అక్కడ రౌడీలు సత్యకి సపోర్ట్ చేస్తారా అని వృద్ధులను బయటకు నెట్టేస్తారు. సామాను చల్లేస్తారు. ఇక విశ్వనాథం బైక్పై బయట నుంచి వస్తుంటే రుద్ర విశ్వాన్ని చావు దెబ్బలు కొట్టమని అంటాడు. భయంతో చావాలని చెప్తాడు. దాంతో రౌడీలు విశ్వనాథాన్ని ఫాలో అవుతారు. ఇక ఆటోలో పాలో అవుతున్న హర్ష విశ్వనాథాన్ని చూసి బైక్ ఆపి బైక్ ఎక్కించుకుంటాడు. ఏమైందని విశ్వనాథం అడిగితే సత్యకి సపోర్ట్ చేస్తామని చెప్పాం కదా యుద్ధం మొదలైంది అని చెప్తాడు. రౌడీల నుంచి తండ్రిని కాపాడి సత్యకి కాల్ చేసి నాన్న నా దగ్గరే ఉన్నారని కంగారు లేదని చెప్తాడు. సత్య వాళ్లు వృద్ధాశ్రామానికి వచ్చే సరికి పెద్దావిడను రౌడీలు తోసేస్తారు. ఆమె కింద పడిపోతుంది. సత్య నీరు తాగిస్తుంది.. కానీ ఆ ముసలావిడ చనిపోతుంది. ఎవరు ఎంత చెప్పినా మమ్మల్ని చంపిన పర్లేదు మేము మీకే సపోర్ట్ చేస్తామని ఆశ్రమంలోని ముసలి వాళ్లు అంటారు. కానీ సత్యం మాత్రం వాళ్ళని నాకు ఎవరు సపోర్ట్ చేయొద్దు నావల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దని అంటుంది.


సత్య క్రిష్తో స్వార్థం కోసం మీ వాళ్లు ఎంతకు తెగిస్తున్నారో నీకు తెలుస్తుందా అని అంటుంది. ఇంత మంది బాగోగులు చూసుకుంటున్న ఈవిడను చంపేశారని అంటుంది. అందరినీ నేను తీసుకెళ్లిపోతాను ఎక్కడైనా తీసుకెళ్లిపోతా ఈ పెద్దావిడను బతికించమని అరుస్తుంది. రేపో మాపో నా పరిస్థితి ఇంతే అని ఆ పెద్దావిడ ప్లేస్లో నేనే నీ ఒడిలో శవంలా ఉంటానని నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేవు అని అంటుంది. క్రిష్ షాక్ అయిపోతాడు. నువ్వు వెళ్లిపో క్రిష్ మీ అన్నయ్య మీ బాపు నిన్ను ఇక్కడ చూస్తే మరో ప్రళయం చేస్తారని అంటుంది. అక్కడున్న అందరికీ సత్య తన వాళ్ల వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్తుంది. రాత్రి క్రిష్ మందు తాగుతూ సత్య మాటలు తలచుకొని ఉంటాడు. గదిలో సత్య ఏడుస్తుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో జయమ్మ క్రిష్ కు హితబోధ చేస్తుంది..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×