E-Paper
Advertisement

కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. కాబోయే భార్య కావాలని చంపలేదా? ప్రియుడే బెదిరించాడా?

కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. కాబోయే భార్య కావాలని చంపలేదా? ప్రియుడే బెదిరించాడా?
Advertisement

Ketan Murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అతనికి కాబోయే భార్య సియా గోయల్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు తొలుత ఆరోపణలు రాగా.. తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రియుడు చేతన్ చౌదరి.. హత్య చేసేలా సియాను బలవంతం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేతన్ ను చంపాల్సిందిగా.. సియా గోయల్ పై అతడు ఒత్తిడి తీసుకొచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లోహ్‌గఢ్‌ కోటలో కేతన్‌ను హత్య చేసేలా సియాను చేతన్‌ ప్రేరేపించాడని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మే నెలలో అతడిని అంతమొందించడానికి ప్రయత్నించిన విషయాన్ని బయటపెడతానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే చేతన్ సియాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, గతంలో దిగిన ఫొటోలను కేతన్ కు చూపిస్తానని ఏమైనా బెదిరించాడా? అన్న అనుమానాన్ని సైతం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో వారు పడ్డారు.

Advertisement

పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే తొలుత చేతన్ తన ప్రేయసి సియాతో పారిపోవాలని భావించాడు. కానీ అనూహ్యంగా అతడు తన ప్లాన్ ను మార్చుకొని కేతన్ ను హత్యకు కుట్ర పన్నాడు. అగర్వాల్ కుటుంబానికి ఉన్న అపారమైన సంపదపై కన్నేసి.. చేతన్ ఇలాంటి కుట్రకు పాల్పడ్డాడా? అన్న కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మే నెలలో విఫలమైన హత్యాయత్నం విషయాన్ని అడ్డుపెట్టుకొని సియా దగ్గర ఏమైనా భారీగా డబ్బు డిమాండ్ చేశాడా? అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

Also Read: వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి? అస్సలు చేయకూడని తప్పులివే!

Advertisement

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇంకో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తమ బిడ్డ మరణానికి సంబంధించి తమకు న్యాయం చేయాలని కేతన్ తల్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసిన కొద్దిసేపటి తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ ఘటన చాలా దిగ్భ్రాంతికరమని.. కేతన్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సీనియర్ లాయర్ ఉజ్వల్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా ఉజ్వల్ 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసు, ఇతర సంచలనాత్మక కేసుల్లో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేయడం విశేషం.

Also Read: వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!

Related News

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

వీకెండ్‌లో ఫుల్ ఎంజాయ్, వోడ్కా తాగిన-ఆ తర్వాత, అసలు మేటరేంటంటే..

హైవే‌పై ఘోర ప్రమాదం..టైరు పగిలి ఏకంగా 100 మీటర్ల వరకు కారు, తప్పించుకున్న బీజేపీ ఎమ్మెల్యే

వివాదంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్.. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×