E-Paper
Advertisement

రూ.5 వేలలోపు అదిరిపోయే సౌండ్.. మార్కెట్లోకి ఇరగదీసే ఫీచర్లతో ఐటెల్ సౌండ్‌బార్లు!

రూ.5 వేలలోపు అదిరిపోయే సౌండ్.. మార్కెట్లోకి ఇరగదీసే ఫీచర్లతో ఐటెల్ సౌండ్‌బార్లు!
Advertisement

itel 160W soundbar price in India: ఇంట్లోనే కూర్చుని సినిమా హాల్ లాంటి కరుకు బేస్, క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ప్రముఖ బడ్జెట్ టెక్ బ్రాండ్ ఐటెల్ (itel) రెండు సరికొత్త పవర్‌ఫుల్ సౌండ్‌బార్లను ఇండియన్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఏకంగా 160W వరకు సౌండ్ అవుట్‌పుట్ , వర్చువల్ 360° ఆడియో ఫీచర్‌తో వచ్చిన ఈ సౌండ్‌బార్లు మీ టీవీ చూసే ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. తక్కువ ధరలోనే లభిస్తున్న ఈ హోమ్ థియేటర్ల విశేషాలు , ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇల్లే సినిమా హాల్.. ఐటెల్ సరికొత్త 160W సౌండ్‌బార్ల హంగామా:

ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా అంటూ వీకెండ్ వస్తే చాలు ఇంట్లోనే.. స్మార్ట్ టీవీల ముందు వాలిపోతున్నాం. అయితే .. ఎంత పెద్ద టీవీ ఉన్నా సరే, పవర్‌ఫుల్ సౌండ్ లేకపోతే ఆ మజానే వేరు. ఈ విషయాన్ని గమనించిన ఐటెల్ (itel) కంపెనీ, తక్కువ బడ్జెట్‌లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మార్చేసేందుకు రెండు సరి కొత్త సౌండ్‌బార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా itel ఐఎస్బీ-40 (itel ISB-40) మరియు itel ఐఎస్బీ-60 (itel ISB-60) మోడళ్లను పరిచయం చేసింది.

థియేటర్ లాంటి వర్చువల్ 360° ఆడియో మ్యాజిక్:

Advertisement

ఈ రెండు సౌండ్‌బార్లలోని అత్యంత పెద్ద హైలైట్ ఏంటంటే.. Virtual 360° Surround Audio టెక్నాలజీ. దీని వల్ల మీరు రూమ్‌లో ఎక్కడ కూర్చున్నా సరే, సౌండ్ మీ చుట్టూ ఉన్నట్లుగా ఒక త్రీడీ ఎఫెక్ట్ లభిస్తుంది. యాక్షన్ సినిమాలు చూసేటప్పుడు వచ్చే బుల్లెట్ శబ్దాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి.

వేరియంట్లు – ఫీచర్లు:

1. itel 120W Soundbar (బేసిక్ మోడల్):
ఇది 120W పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. చిన్న సైజ్ లివింగ్ రూమ్‌లు లేదా బెడ్‌రూమ్‌లకు ఇది పక్కాగా సరి పోతుంది. ఇందులో డీప్ బేస్ కోసం పవర్‌ఫుల్ వైర్డ్ సబ్‌వూఫర్ అందించారు.

Advertisement

2. itel 160W Soundbar (ప్రీమియం మోడల్):
ఇక భారీ సౌండ్ కావాలనుకునే వారి కోసం ఏకంగా 160W అవుట్‌పుట్‌తో ఈ మోడల్‌ను తెచ్చారు. దీంతో పాటు వైర్‌లెస్ సబ్‌వూఫర్ లభిస్తుంది. అంటే వైర్ల గొడవ లేకుండా సబ్‌వూఫర్‌ను రూమ్‌లో మీకు నచ్చిన మూలన పెట్టుకోవచ్చు. దీని బేస్ ఇల్లు అదిరిపోయేలా ఉంటుంది.

కనెక్టివిటీ ఆప్షన్లు :
ఈ సౌండ్‌బార్లలో కనెక్టివిటీకి ఎలాంటి లోటు లేదు. మీ స్మార్ట్ టీవీ, మొబైల్ లేదా లాప్‌టాప్‌కు కనెక్ట్ చేయడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.

1.లేటెస్ట్ Bluetooth 5.3 సపోర్ట్ (లాగ్ లేని వైర్‌లెస్ మ్యూజిక్ కోసం)

2.HDMI (ARC) పోర్ట్ (టీవీ రిమోట్‌తోనే సౌండ్‌బార్ కంట్రోల్ చేయవచ్చు)

3.ఆప్టికల్ ఇన్‌పుట్, AUX , USB పోర్ట్‌లు.

డిజైన్ హైలైట్: ఈ సౌండ్‌బార్లు చాలా స్లిమ్‌గా, గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. మీ స్మార్ట్ టీవీ కింద ఉంచితే హాల్‌కి ఒక లగ్జరీ లుక్ వస్తుంది. వీటిని గోడకు కూడా తగిలించుకోవచ్చు (Wall Mountable).

Also Read: రెడ్ డాట్ డిజైన్ అవార్డ్ గెలుచుకున్న.. నోయిస్ సరికొత్త గ్యాడ్జెట్ ఇదే !

ధరల వివరాలు:
ఐటెల్ ఎప్పుడూ తన ప్రైసింగ్‌తో సంచలనాలు సృష్టిస్తుంది. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. itel 120W Soundbar ధర మార్కెట్లో కేవలం రూ.3,999 గా ఉంది. itel 160W Soundbar (Wireless Subwoofer) ధర కేవలం రూ.4,499 గా నిర్ణయించారు.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ హంగులు ఆశించే ఇండియన్ యూజర్లకు ఐటెల్ కొత్త సౌండ్‌బార్లు పర్‌ఫెక్ట్ ఆప్షన్. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో, వైర్ల గోల లేని పవర్‌ఫుల్ బేస్ హోమ్ థియేటర్ కావాలంటే మాత్రం itel 160W Soundbar ని కళ్లు మూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్ సినిమా ప్లాన్స్‌ను ఐటెల్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళండి.

Related News

ఇలాంటి ఫ్రిజ్ ఇంట్లో ఉంటే..15 రోజులైనా ఫ్రెష్ ఫుడ్

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

Big Stories

Advertisement
×