E-Paper
Advertisement

టాయిలెట్ ఫ్లష్ చెయ్యొద్దు.. రాత్రపూట నవ్వొద్దు.. ఇవేం వింత చట్టాలు రా అయ్యా!

టాయిలెట్ ఫ్లష్ చెయ్యొద్దు.. రాత్రపూట నవ్వొద్దు.. ఇవేం వింత చట్టాలు రా అయ్యా!
Advertisement

Strangest Laws in the World: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఉన్న చట్టాలు, నిబంధనలు వింటే నిజంగానే ఆశ్చర్యంగా కలిగిస్తాయి. అవి కల్పిత కథల్లా కనిపించినా, కొన్ని మాత్రం నిజమైన సంఘటనలు, స్థానిక ఆచారాలు, నిబంధనల నుంచి పుట్టుకొచ్చాయి. అయితే, ప్రచారంలో ఉండే ప్రతి వింత చట్టం నిజమైన చట్టం కాకపోవడం విశేషం.

సింగపూర్‌లో చూయింగ్ గమ్‌ పై ఆంక్షలు

సింగపూర్‌లో చూయింగ్ గమ్‌కు సంబంధించిన నిబంధనలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. 1990 ప్రారంభంలో MRT రైళ్లలో కొందరు వ్యక్తులు చూయింగ్ గమ్‌ ను డోర్ సెన్సార్లకు అంటించడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతిపై కఠినమైన ఆంక్షలు వచ్చాయి. ప్రస్తుతం మెడికల్, డెంటల్ ట్రీట్మెంట్ కు ఉపయోగించే కొన్ని గమ్‌లకు మాత్రం ప్రత్యేక అనుమతి ఉంది.

పందికి నెపోలియన్ పేరు పెట్టకూడదట!

Advertisement

ఫ్రాన్స్‌ కు సంబంధించిన మరో కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పందికి  నెపోలియన్ అనే పేరు పెట్టకూడదనే విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే, ఆధునిక ఫ్రెంచ్ చట్టంలో ఉన్న నిబంధన కాదు. అంటే ఒకప్పుడు ఉన్న ఆచారం, కథనం కాలక్రమంలో చట్టంగా మారిపోయినట్టుగా ప్రచారం జరిగింది.

జర్మనీ టాయిలెట్ ఫ్లష్ చేయకూడదట!

జర్మనీలో రాత్రి సమయంలో శబ్దం చేయకూడదనే  రుహెజైట్  అనే నిశ్శబ్ద సమయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇతరులకు ఇబ్బంది కలిగించే సౌండ్స్ పై నిబంధనలు అమలులో ఉంటాయి. అయితే, రాత్రి పూట టాయిలెట్‌ ఫ్లష్ చేయకూడదనేది కూడా ఈ నిబంధనల్లో ఒకటి.

ఇండోనేషియాలో రాత్రిపూట నవ్వకూడదట!

Advertisement

ఇండోనేషియాలో కూడా రాత్రి వేళల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే శబ్దాలకు సంబంధించి స్థానిక నిబంధనలు ఉన్నాయి. అయితే, రాత్రి నవ్వితే చట్టవిరుద్ధమనే ప్రచారం మాత్రం అతిశయోక్తిగానే కనిపిస్తుంది.

పని వేళ్లలో నిద్ర నేరం!

గ్వాటెమాలాలో పని సమయంలో నిద్రపోవడం నేరంగా పరిగణిస్తారు. అయితే, వీటికి శిక్షలు లేవు. కెనడాలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న విచిత్రమైన స్థానిక నిబంధనల గురించి కూడా సోషల్ మీడియాలో ఎన్నో కథలు కనిపిస్తాయి.

ఎక్కువ అడల్ట్ టాయ్స్ తీసుకెళ్లొద్దట!

థాయ్‌లాండ్‌లో అడల్ట్ టాయ్స్‌ కు సంబంధించిన చట్టాలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే 14 కంటే ఎక్కువ తీసుకెళ్తే నేరంగా భావిస్తారు. అయితే, ఈ వైరల్ విషయాలను పూర్తిగా నిజమని నమ్మే ముందు అధికారిక సమాచారం పరిశీలించడం మంచిది.

పార్లమెంట్ భవనంలో మరణం చట్ట విరుద్ధం

ఇక బ్రిటన్‌లోని పార్లమెంట్ భవనంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సి ఉంటుంది. కాబట్టి. అక్కడ మరణించడం చట్టవిరుద్ధమనే కథ చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దీనికి బ్రిటిష్ చట్టంలో స్పష్టమైన ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే, వింత చట్టాల కథల్లో అసలు ఆసక్తి చట్టం కంటే దాని వెనుక ఉన్న కథలోనే ఉంటుంది. పాత సంఘటనలు, స్థానిక ఆచారాలు, అపార్థాలు కలిసిపోయి కొన్ని నిబంధనలు కాలక్రమంలో  వింత చట్టాలుగా మారిపోయాయి.

Read Also: హోటళ్లలో Wi-Fi వాడుతున్నారా? అయితే.. మీ వీడియోలు బయటకొస్తాయ్!

Tags

Related News

హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. మరో రైల్వే టెర్మినల్‌ వచ్చేస్తోంది!

యుఏఈ ఫ్రీ వీసా.. భారతీయులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించిన యుఏఈ.. కండీషన్స్ ఇవే

నీటి తెర వెనుక దాగిన అద్భుతం.. హైదరాబాద్ సమీపంలో క్రేజీ వీకెండ్ డెస్టినేషన్!

ప్రపంచంలోనే 5 బెస్ట్ రైలు ప్రయాణాలు.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

రష్యా నుంచి భారత్‌కు డైరెక్ట్ ట్రైన్.. ప్రయాణికుల కోసం కాదా?

రైళ్లలో ఏఐ సర్వేలెన్స్.. ఇక వారికి చుక్కలే!

Big Stories

Advertisement
×