E-Paper
Advertisement

స్టార్ హోటల్‌లో దారుణం.. ఇద్దరు కూతుళ్లను చంపి, ఆ తర్వాత తండ్రి కూడా..

స్టార్ హోటల్‌లో దారుణం.. ఇద్దరు కూతుళ్లను చంపి, ఆ తర్వాత తండ్రి కూడా..
Advertisement

Bengaluru: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఇలాంటి విషయాలు భార్యభర్తల మధ్య అనుమానాలు పెంచుతున్నాయి. అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. ఆవేశంలో అనేక అనర్థాలు దారితీస్తోంది. స్టార్ హోటల్‌లో ఇద్దరు కూతుళ్ల నుంచి చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

 

బెంగుళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో దారుణం

Advertisement

సోమవారం సాయంత్రం బెంగళూరులో ఓ దంపతుల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. చివరకు భర్తను రాక్షసుడిగా మార్చేసింది. భార్యపై అనుమానాలతో ఆగ్రహానికి గురైన భర్త, తన ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది అలర్ట్ కావడం, పోలీసులు స్పందించడంతో భర్త బయట పడ్డాడు. హోటల్‌లో లభించిన ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో భార్యపై తీవ్రమైన ఆరోపణలు భర్త చేశాడు.

 

పిల్లలను చంపిన తండ్రి, ఆపై ఆత్మహత్యాయత్నం

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ స్టార్ హొటల్ ఉంది. అందులో రూమ్ బుక్ చేశాడు 40 ఏళ్ల ఇమ్రాన్. ఇమ్రాన్ కుటుంబం బెంగళూరు సిటీలోని నాగవార ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి ఇద్దరు కూతుళ్ల ఉన్నారు. ఒకరికి 10 పదేళ్లు, మరొకరికి 5 ఏళ్లు. హోటల్ రూమ్‌లో ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. పిల్లలను చంపిన తర్వాత, తండ్రి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గదిలో అరుపుల శబ్దాన్ని విన్నారు హోటల్ సిబ్బంది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ట్రీట్‌మెంట్ చేయడంతో బతికి బయటపడ్డాడు.

 

భార్య వ్యవహారమే అందుకు కారణమా?

దీనిపై బెంగుళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇమ్రాన్‌.. తన భార్యపై అనుమానం పెంచుకున్నట్లు తెలిపారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని భావించాడట. పిల్లలు ఇలాంటి తల్లితో ఉండకూడదని భావించాడు. వారిని చంపి, అతడు చనిపోవాలని డిసైడ్ అయ్యాడని ఇమ్రాన్‌ చెప్పినట్లు వెల్లడించారు. గదిలో దొరికిన లేఖతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్రాన్‌.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ముందు రోజు సాయంత్రం హోటల్‌లో దిగాడు. హోటల్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఇద్దరు చిన్నారులు మంచంపై విగతజీవులుగా ఉన్నారు. తండ్రి గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన స్థితిలో కనిపించాడని వివరించారు. తన కూతుళ్లను ఇమ్రాన్ చంపినట్లు అంగీకరించాడని వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ALSO READ: రణరంగంగా మారిన రాంచీ విద్యార్థుల ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం, లాఠీఛార్జ్-టియర్ గ్యాస్ ప్రయోగం

Related News

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

ఢిల్లీలో షాకింగ్ న్యూస్.. ఓ యువకుడిని చెంప దెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి?

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×