E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?

ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?
Advertisement

Prakash Raj Vote: నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోమారు వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో ఆయన ఓటు పోవడమే ఇందుకు కారణం. నిజానికి ప్రకాశ్ రాజ్ కు నాలుగు రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉన్నట్లు తొలి నుంచి ప్రచారం ఉంది. దీనిపై ఫిర్యాదు అందగా ఈ ఏడాది జూన్ లో ఆయన కోర్టు మెట్లు సైతం ఎక్కారు. ఈ క్రమంలోనే బెంగళూరులో గల్లంతైన 65 లక్షల ఓట్లలో ప్రకాశ్ రాజ్ ది ఒకటి కావడం చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశ్ రాజ్ స్పందన ఏంటంటే?

తన ఓటు తీసేసిన విషయాన్ని ప్రకాశ్ రాజ్ స్వయంగా తెలియజేశారు. ఈ మేరకు కేంద్రాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. బెంగళూరులోనే పుట్టి, అక్కడే చదువుకొని, నటన సైతం ఈ నేలపై నేర్చుకొని.. చివరకి ఇక్కడే ఎంపీగా పోటీ చేసిన తన ఓటును తొలగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరిగి ఓటర్ కార్డు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారో అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ‘ఓటు వేయని వారని తొలగించొచ్చు కానీ.. అధికారం నుంచి దింపకుండా ఆపగలరా?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Advertisement

ఆ రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయా?

ప్రస్తుతం ఈసీ నిర్వహిస్తున్న SIR ప్రక్రియ.. ఒక వ్యక్తికి ఓకే ఓటు అన్న లక్ష్యంతో సాగుతోంది. అయితే ఇప్పటికే ప్రకాశ్ రాజ్ కు కర్ణాటకతో పాటు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బెంగళూరుకు చెందిన న్యాయవాది దిలీప్ కుమార్ 2019లో హలసూరు గేట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సరైన స్పందన రాకపోవడంతో బెంగళూరు 48వ ఏసీజేఎం కోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు రావాలని ఎన్నిసార్లు కోర్టు ఆదేశించిన ప్రకాశ్ రాజ్ పట్టించుకోకపోవడంతో ఆయనకు ఈ ఏడాది జూన్ 22న కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో వ్యక్తిగతంగా నటుడు హాజరవడంతో బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో కొనసాగుతున్న క్రమంలోనే బెంగళూరు నుంచి ఆయన ఓటును తొలగిస్తూ ఈసీ ఝలక్ ఇచ్చింది.

దరఖాస్తు చేశారా? లైట్ తీసుకున్నారా?

Advertisement

అయితే ప్రకాశ్ రాజ్ ఓటును బెంగళూరు నుంచి తొలగించడాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న లక్ష్యంతో ప్రస్తుతం SIR ప్రక్రియ సాగుతోందని గుర్తుచేస్తున్నారు. బెంగళూరులో ఉన్న ఓటుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు ఈసీకి సమర్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పేర్కొంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఓటుకు సంబంధించి పత్రాలు సమర్పించి ఉంటే.. మిగతా 3 రాష్ట్రాల్లో ఆటోమేటిగ్గా ఓట్లు పోతాయని భయపడ్డారా? అని నటుడ్ని ప్రశ్నిస్తున్నారు. అదే మిగిలన 3 రాష్ట్రాల్లో ప్రకాశ్ రాజ్ ఓటరుకాకుండా పోయేవారని.. ఫలితంగా అక్కడి రాజకీయ వ్యవహరాల్లో తలదూర్చి విమర్శించే నైతిక హక్కును కోల్పోయేవారని అంటున్నారు. మెుత్తం మీద సంబంధిత పత్రాలు ప్రకాశ్ రాజ్ ఇచ్చారా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు.

Also Read: అనాడు ప్రేమికులు.. నేడు సీఎం దంపతులు.. 34 ఏళ్లనాటి స్వీట్ మెమోరీస్!

ఎదురెళ్లి ఆయుధం ఇచ్చారా?

ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ ఓటును తొలగించి.. ఆయనకు కేంద్రం ఎదురెళ్లి మరీ ఆయుధం ఇచ్చిందా? అన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నటుడు ప్రకాశ్ రాజ్ #Just Asking అనే ట్యాగ్ తో మోదీ ప్రభుత్వాన్ని ప్రతీ చిన్న అంశంలోనూ నిలదీస్తూ వస్తున్నారు. ఇటీవల జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారికి మద్దతు సైతం ప్రకటించారు. కేంద్ర మంత్రి రాజీనామాతో ఆ నిరసనలు ఆగిపోగా.. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఓటు తొలగించడం వల్ల ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ వ్యతిరేకుల ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రకాశ్ రాజ్ కు ఆయుధమిచ్చారని పలువురు పేర్కొంటున్నారు. తాజా వీడియోలో ప్రకాశ్ రాజ్ నవ్వుతూ మాట్లాడటానికి ఇదే కారణమని విశ్లేషిస్తున్నారు.

Also Read: వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

Tags

Related News

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

ఢిల్లీలో షాకింగ్ న్యూస్.. ఓ యువకుడిని చెంప దెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి?

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×