E-Paper
Advertisement

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి? అస్సలు చేయకూడని తప్పులివే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి? అస్సలు చేయకూడని తప్పులివే!
Advertisement

Fridge Temperature: వర్షాకాలం (monsoon) వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు గాల్లో తేమ శాతం (humidity) కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సీజన్‌లో బయట వస్తువులే కాకుండా కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలు కూడా త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే చాలామంది వేసవి కాలంలో ఫ్రిజ్ కూలింగ్ పెంచి.. వర్షాకాలం రాగానే కూలింగ్‌ను బాగా తగ్గించేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదని నిపుణులు పేర్కొంటున్నారు. మరి వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి? ఆహారం బూజు పట్టకుండా ఎలా కాపాడుకోవాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఫ్రిజ్ టెంపరేచర్

వర్షాకాలంలో ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత 3°C నుండి 4°C మధ్య ఉండేలా చూసుకోవాలి. ఇది బ్యాక్టీరియా, బూజు చేరకుండా ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది. అలాగే ఫ్రీజర్ టెంపరేచర్‌ను -18°C లేదా అంతకంటే తక్కువగా సెట్ చేసుకోవడం బెటరని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఫ్రిజ్ డిజిటల్ సెట్టింగ్ కాకుండా 1 నుంచి 7 వరకూ నెంబర్లు ఉంటే.. వర్షాకాలంలో 3-4 మీద టెంపరేచర్ సెట్ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

తేమ ముప్పు ఏంటి?

Advertisement

వర్షాకాలంలో ఫ్రిజ్ డోర్ తీసిన ప్రతిసారీ బయట ఉండే తేమతో కూడిన గాలి లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఫ్రిజ్ లోపల నీటి చుక్కలు చేరి.. కూరగాయలు త్వరగా కుళ్ళిపోవడం లేదా బూజు పట్టడం జరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో సరైన టెంపరేచర్ మెయిన్ టెన్ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కూరగాయలు నేరుగా పెట్టొద్దు..

వర్షాకాలంలో ఫ్రిజ్ లో పెట్టిన కూరగాయాలు, ఆహారపదార్థాలు పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలపై తడి ఉంటుంది కాబట్టి కాసేపు ఆరబెట్టి తడి లేదని నిర్ధారించుకున్నాకే పేపర్ బ్యాగుల్లో లేదా జిప్‌లాక్ కవర్లలో ఉంచాలని సూచిస్తున్నారు.

ఫ్రిజ్ ఫుల్‌గా నింపొద్దు

Advertisement

పదార్థాలు ఉన్నాయి కదా అని ప్రతీది ఫ్రిజ్ లో పెట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు. సామాన్లను ఇరుకైనట్లు పెడితే లోపల చల్లటి గాలి సరిగ్గా తిరగదు. దీనివల్ల కొన్ని భాగాలకు కూలింగ్ అందక ఆహారం పాడవుతుంది. కాబట్టి వస్తువుల మధ్య కాస్త గ్యాప్ ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫ్రిజ్ డోర్ ను పదే పదే తీయవద్దని.. హితవు పలుకుతున్నారు. లేదంటే బయటి తేమ లోపలికి వెళ్తుందని పేర్కొంటున్నారు.

Also Read: టచ్‌ప్యాడ్ vs మౌస్.. ల్యాప్‌టాప్ వాడేవారికి ఏది బెస్ట్ చాయిస్?

మిగిలిన ఆహారాన్ని..

వండిన అన్నం, కూరలు మిగిలిపోతే వాటిని గాలి చొరబడని టైట్ స్టీల్ బాక్స్ లో పెట్టి మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మెుత్తంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉందని.. ఫ్రిజ్ కూలింగ్ ను పూర్తిగా తగ్గించకుండా.. పైన సూచించిన టెంపరేచర్ సెట్టింగ్స్ పాటిస్తే ఆహారపదార్థాలు పదిలంగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!

Related News

ఇలాంటి ఫ్రిజ్ ఇంట్లో ఉంటే..15 రోజులైనా ఫ్రెష్ ఫుడ్

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

Big Stories

Advertisement
×