E-Paper
Advertisement

QS Rankings 2027: ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-205లో నాలుగు ఐఐటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ..

QS Rankings 2027: ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-205లో నాలుగు ఐఐటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ..
Advertisement

QS Rankings 2027: ప్రపంచంలో విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశ ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యా సంస్థలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని నాలుగు ఐఐటీలు 205 లోపు ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటులో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.

 

ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు

Advertisement

క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అనేది బ్రిటన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్-QS అనే సంస్థ ప్రచురిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్. ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాలను అంచనా వేసి వాటికి ర్యాంకులు ఇస్తుంది. దీన్ని ప్రమాణికంగా తీసుకుంటాయి విద్యా సంస్థలు. 2004లో తొలిసారిగా ర్యాంకింగ్స్ పద్దతిని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ప్రపంచంలో టాప్ యూనివర్సిటీల జాబితాను ప్రకటిస్తుంది ఆ సంస్థ.

 

టాప్-205లో నాలుగు ఐఐటీలు

Advertisement

దశాబ్దకాలంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య 11 నుంచి 52కు చేరింది. అందులో 205 లోపు నాలుగు ఐఐటీలు చోటు దక్కించుకున్నాయి. దేశంలో ఐఐటీ ఢిల్లీ నెంబర్ వన్‌లో నిలిచింది. దశాబ్దం కిందట ఈ జాబితాలో కేవలం 11 భారతీయ విద్యా సంస్థలు ఉండేవి. తాజా ర్యాంకింగ్‌లలో ఇప్పుడు 52 సంస్థలు చేరాయి. ఐఐటి ఢిల్లీ ఐదు స్థానాలు ఎగబాకి దేశంలో ఉత్తమ సంస్థగా నిలిచింది. ప్రపంచంలో 118వ ర్యాంకు సాధించింది.

 

ప్రైవేటు విద్యాసంస్థలు ఈసారి ఎంట్రీ

52 భారత్ విశ్వవిద్యాలయాల్లో 26 సంస్థలు తమ ర్యాంకింగ్‌లను గణనీయంగా మెరుగుపరుచుకున్నాయి. తొమ్మిది సంస్థలు తమ మునుపటి స్థానాలను నిలుపుకున్నాయి. తొలిసారి రెండు కొత్త సంస్థలు ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాయి. దేశంలోని అత్యంత పురాతన విద్యా సంస్థలు ఐఐటీలు కాకుండా, ప్రైవేట్ సంస్థలు అడుగుపెట్టాయి. వీఐటీ 94 స్థానాలు ఎగబాకి 597వ స్థానానికి చేరింది. బిట్స్ పిలాని 93 స్థానాలు ఎగబాకి 575 వ స్థానానికి చేరింది.

ఐఐటి హైదరాబాద్, జామియా మిలియా ఇస్లామియాలు గణనీయమైన మెరుగుదల నమోదు చేశాయి. భారతీయ విద్యాసంస్థలు కనబరుస్తున్న అద్భుతమైన పని తీరుకు, కేంద్ర ప్రభుత్వం-విద్యా శాఖ చేపట్టిన సంస్కరణలు ప్రాథమిక కారణాలని భావిస్తోంది కేంద్రం.  దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థగా ఐఐటి ఢిల్లీ నిలిచింది. ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 118వ స్థానానికి చేరింది.

ALSO READ: రేషన్ ఏటీఎం వచ్చేశాయి.. లబ్దిదారులకు బిగ్ రిలీఫ్ ,  క్యూ అవసరం లేదు

ఐఐటి బాంబే-134, ఐఐటి మద్రాస్-170, ఐఐటి ఖరగ్‌పూర్-205 స్థానాల్లో నిలిచాయి. ఐఐఎస్‌సి బెంగళూరు-221వ స్థానంలో నిలిచింది. ఇక దేశంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లలో 2021లో 4,030 సంస్థలు ఉండేవి. గతేడాది ఆ సంఖ్య 7,692కి పెరిగింది. 2014 నుండి దేశంలో కొత్త అగ్రశ్రేణి సంస్థలు 43 కొత్త ప్రీమియం సంస్థలు స్థాపించారు. అందులో 7 ఐఐటీలు, 8 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 9 ఐఐఎంలు ఉన్నాయి.

Related News

యూట్యూబర్‌కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్‌తో భార్య జంప్!

1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!

రేషన్‌కార్డు దారులకు శుభవార్త.. రేషన్ ఏటీఎం వచ్చేశాయి.. ఇక క్యూ అవసరం లేదు

పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

రెస్టారెంట్లపై ఉక్కుపాదం.. నగరవాసుల నీరాజనం.. ఈ ఐఏఎస్ రూటే సెపరేటు!

ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?

పొలంలో గొయ్యి తవ్వి రూ.5 లక్షలు దాచిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత చూస్తే, అయ్యో పాపం!

Big Stories

Advertisement
×