BigTV English

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి చలిపెట్టదా..? ఆయన సూపర్‌ హ్యూమనా..?

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి చలిపెట్టదా..? ఆయన సూపర్‌ హ్యూమనా..?

Rahul Gandhi:సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాహుల్‌ గాంధీ చుట్టూనే చర్చ సాగుతోంది. చలితో, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలో ఆయన కేవలం టీషర్ట్ మాత్రమే ధరించి మాజీ ప్రధానమంత్రుల సమాధులకు వెళ్లి నివాళులు అర్పించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన పక్కన ఉన్న వాళ్లు, కోట్లు, టోపీలు పెట్టుకుని ఉంటే రాహుల్ మాత్రం కేవలం టీషర్ట్‌తో కనీసం కాళ్లకు సాక్సులు కూడా లేకుండా సమాధుల చుట్టూ నడిచారు. ఇదంతా ప్రచారం కోసం చేసిందంటూ బీజేపీ నేతలు తిట్టి పోస్తుంటే.. రాహుల్‌ గాంధీ సూపర్ హ్యూమన్‌ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బాలీవుడ్‌ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ కన్నా రాహుల్‌ గాంధీనే ఫిట్‌నెస్‌ ఐకాన్ అంటూ మరికొంతమంది సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే.. చలి అంత తీవ్రంగా ఉన్నా రాహుల్‌కు ఎందుకు చలిపెట్టలేదన్నదే ఇక్కడ పాయింట్‌.. దానికి శాస్త్రీయమైన కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా మొదలయ్యింది.


చలి ఎంత తీవ్రంగా ఉన్నా కొంతమంది దాన్ని భరించగలగడానికి శాస్త్రీయమైన కారణాలున్నాయంటున్నారు పరిశోధకులు. వారి వారి శరీరాల్లో ఉన్న జీనోమ్‌ కోడ్‌ చోటుచేసుకున్న మార్పులే అంటున్నారు. మన నాడీ వ్యవస్థలో ప్రత్యేకమైన నాడీ కణ గ్రాహకాలు ఉంటాయి. ఇవి ఆకస్మిక వాతావరణ మార్పులపై నేరుగా మొదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలిస్తుంటాయి. ఇవి గ్రహించే దాన్ని బట్టే మనకు చలి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అన్నది తెలుస్తుంది. అయితే.. 2021లో జరిగిన ఓ పరిశోధనలో జన్యుపరమైన మార్పుల వల్ల ఈ నాడీ కణ గ్రాహకాలు అత్యధిక చలిని, వేడిని తట్టుకోగలుగుతున్నాయని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 800 కోట్ల జనాభాలో సుమారు 150 కోట్ల మందిలో ఇలాంటి మార్పులు ఉండవచ్చని అంచనా. రాహుల్‌గాంధీ కూడా ఆ కోవకు చెంది ఉండవచ్చని.. అందుకే అంత చలిలోనూ ఆయనకు ఇబ్బంది కలగకపోయి ఉండొచ్చంటున్నారు పరిశోధకులు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×