E-Paper
Advertisement

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!
Advertisement

Rahul Gandhi- Vijay: తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ కావడం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. స్వయంగా విజయ్ నివాసంలో జరిగిన ఈ సమావేశం ఇరు పార్టీల మధ్య నూతన సమీకరణాలకు తెరతీసింది.

లంచ్‌తో పాటు పొలిటికల్ చర్చలు

Advertisement

చెన్నై నీలంకరైలోని సీఎం విజయ్ నివాసంలో సుమారు గంటపాటు ఈ సమావేశం సాగింది. ఈ భేటీలో భాగంగా ఇద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు సమీపంలోని కేఫ్‌లోనూ గడిపారు. టీవీకే పార్టీ ఇండియా కూటమిలో చేరిన తర్వాత రాహుల్, విజయ్ ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పొత్తు బలోపేతంపైనే ప్రధాన దృష్టి

Advertisement

తమిళనాడులో కాంగ్రెస్- టీవీకే మధ్య రాజకీయ బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సమన్వయం, అనుసరించాల్సిన కూటమి వ్యూహాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

ఈ సమావేశానికి ప్రాధాన్యం ఎందుకు?

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి నేతలు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. అయితే, టీవీకే పార్టీ ఈ ఆందోళనలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ.. చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఛాత్రోన్‌ కీ గూంజ్‌కార్యక్రమంలో పాల్గొనేందుకు పయనమయ్యారు.

Also Read: కరెంట్ కొందామన్నా దొరకట్లేదు! ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర హెచ్చరిక!

Tags

Related News

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

Big Stories

Advertisement
×