
Rahul Gandhi latest news(Telugu breaking news today):
దేశ ప్రతిష్టను మంటగలిపేలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు రాహుల్‌గాంధీ. ప్రధాని మోదీకి సన్నిహితుడైన అదానీ తన కంపెనీ షేర్ల విలువ పెంచుకునేందుకు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అదానీకి మోదీ ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు రాహుల్. జేపీసీ ఎందుకు వెయ్యడం లేదని నిలదీశారాయన.
బిలియన్ డాలర్ల బ్లాక్ మనీ భారత్ నుంచి వెళ్లి.. మళ్లీ వివిధ మార్గాల్లో తిరిగి వచ్చిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను కోట్ చేశారు రాహుల్. విదేశాల నుంచి పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారని.. ఆ డబ్బంతా ఎవరిదని ప్రశ్నించారు. ఈ అక్రమాల మాస్టర్ మైండ్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ అని ఆరోపించారు.
అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్ చిట్ ఇచ్చిందని.. క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి అదానీకే చెందిన ఎన్డీటీవీలో ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారని.. దీన్నిబట్టే ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోందన్నారు రాహుల్‌గాంధీ.
అదానీ కుంభకోణంపై విచారణ ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న జీ20 సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని రాహుల్ నిలదీశారు.
Narayana : రుషికొండలో అభివృద్ధి పేరుతో అరాచకం.. సీపీఐ నారాయణ విమర్శలు..