
Elephant attack in chittoor(Breaking news in Andhra Pradesh):
అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఒంటరి ఏనుగు చిత్తూరులో బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ముగ్గురిని బలి తీసుకుంది. అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అతికష్టం మీద ఆపరేషన్ గజ చేపట్టి.. ఆ మదపుటేనుగును బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే…
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతం. బుధవారం అంతా పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఇంతలో అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఒంటరి ఏనుగు.. ఒక్కసారిగా పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై దాడి చేసింది. దంపతులను చంపేసి.. తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.
గురువారం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి మరో మహిళను చంపేసింది ఆ ఏనుగు. మొదటిరోజే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే మరో నిండు ప్రాంణం పోయిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.
అటు, మదపుటేనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ చేపట్టింది అటవీశాఖ. ననియాల ప్రాజెక్టు నుంచి తెచ్చిన రెండు కుంకీ ఏనుగుల సాయంతో ఆ ఏనుగును అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. రామాపురం దగ్గర చెరుకు తోటలో కనిపించిన ఏనుగుపై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. మత్తులో ఉన్న ఏనుగును రెండు కుంకీ ఏనుగుల సహాయం తో అదుపులోకి తెచ్చారు. అనంతరం, తిరుపతి జూ పార్కు తరలించారు.
KCR : విశ్వగురువు కాదు.. విషగురువు.. మోదీపై కేసీఆర్ ఘాటు విమర్శలు