Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జెన్ జీ యువతతో మమేకమయ్యేందుకు కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెషన్ నిర్వహించారు. అందులో యువత అడిగిన వివిధ అంశాలపై నేరుగా సమాధానం ఇచ్చారు. కేవలం విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థ, రాజకీయాలు, నచ్చిన నేతల గురించి మనసులోని మాట బయటపెట్టారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఎక్కడకు వెళ్లినా ఎక్కువగా యువతీ యువకులతో మమేకం అవుతున్నారు. తన సెక్యూరిటీని పక్కనపెట్టి వారితో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యువత ఆలోచనలను తెలుసు కుంటారు. వారి అడిగిన.. అడుగుతున్న ప్రశ్నలకు సంకోచించకుండా సమాధానాలు ఇస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్ జీ- విద్యార్థులతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో నిర్వహించారు. ఈ క్రమంలో ఇష్టమైన బీజేపీ నాయకుడు ఎవరని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ ఏమాత్రం ఆలోచించలేదు. తనకు ఇష్టమైన బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఠక్కున చెప్పారు. దీంతో అక్కడున్న వారి నోట వెంట మాట రాలేదు. అమరీందర్ మామ అంటూ రిప్లై ఇచ్చారు.
కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధానికి తెంచుకున్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్. ప్రస్తుతం ఆయన బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం రాజకీయ చర్చలకు దారి తీసింది. పంజాబ్‌లో ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరు కెప్టెన్ అమరీందర్ సింగ్. కాంగ్రెస్ తరపున ఆయన ఆ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు.
ఆ పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీలో ఆ పార్టీని విలీనం చేశారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. రాహుల్‌గాంధీ మాటలు గాంధీ కుటుంబానికి- కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేస్తుంది.
ఎందుకంటే కెప్టెన్ అమరీందర్ సింగ్- రాజీవ్ గాంధీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో సహచరులుగా ఉండేవారు. మంచి స్నేహితులుగా కూడా. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆయన్ని ప్రోత్సహించింది రాజీవ్ గాంధీయేనని కెప్టెన్ అమరీందర్ ఒకానొక సందర్భంలో చెప్పారు. 1980 లో కాంగ్రెస్ టికెట్‌పై ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.
రాహుల్‌గాంధీకి చిన్నప్పటినుంచి ఆయన తెలుసు, తరచుగా ఆయనను తమ కుటుంబానికి చెందిన పెద్ద స్నేహితునిగా భావిస్తారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్ అమరీందర్ సింగ్ కొన్ని విషయాలు బయటపెట్టారు. రాహుల్ గాంధీతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి పంచుకున్నారు. ఈ ఏడాది తన పుట్టినరోజు రాహుల్ స్వయంగా శుభాకాంక్షలు చెప్పారని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: త్రిస్సూర్ వద్ద ప్రైవేట్ బస్సు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి, 24 మందికి గాయాలు
తన సోదరుడు రాజా రణధీర్ సింగ్ మరణం తర్వాత రాహుల్ స్వయంగా వచ్చి సంతాపం తెలిపారని గుర్తు చేశారు కెప్టెన్ అమరీందర్. ఏ సీనియర్ బీజేపీ నేత ఇలాంటి సానుభూతి సందేశం ఇవ్వలేదన్నది అక్కడి నేతల మాట. సైనిక చరిత్రలో ఆయన నిపుణుడు, అని సంబోధిస్తూ హలో.. అమరీందర్ మామ అని చెప్పి వీడియో ముగించారు రాహుల్‌గాంధీ.
"Hello, Uncle Amarinder!"
LoP Shri @RahulGandhi gives a warm shoutout to his favourite politician from the BJP. pic.twitter.com/kwgQPDZ5SV
— Congress (@INCIndia) August 6, 2026