BigTV English

Rahul Gandhi in Delhi Metro: లోక్ సభ ఎన్నికల ప్రచారం.. ఢిల్లీ మెట్రోలో రాహుల్ గాంధీ ప్రయాణం..

Rahul Gandhi in Delhi Metro: లోక్ సభ ఎన్నికల ప్రచారం.. ఢిల్లీ మెట్రోలో రాహుల్ గాంధీ ప్రయాణం..

Rahul Gandhi Travelled in Delhi Metro: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సామాన్యులతో ముచ్చటించారు. ప్రస్థుతం రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో సాధారణ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాడు. వారితో ఫోటోలు దిగాడు. మంగోల్‌పురిలో ర్యాలీకి వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ, ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు . లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 25న ఢిల్లీలో పోలింగ్ జరగనుండగా, ఈరోజు(గురువారం) ప్రచారానికి చివరి రోజు.

రాజ్యాంగాన్ని చింపి, విసిరేయాలని బీజేపీ నిరంతరం కోరుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు దానిని రక్షించే పోరాటమని నొక్కి చెప్పారు. పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌కు మద్దతుగా ఈశాన్య ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌లో ఈరోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని నొక్కి చెప్పారు.


“ఈ వ్యక్తులు (బీజీపీ) ఎప్పటినుంచో దానిని (రాజ్యాంగాన్ని) చింపి విసిరేయాలని కోరుకుంటారు. వారు భారత రాజ్యాంగాన్ని లేదా భారత జెండాను ఎన్నడూ అంగీకరించలేదు. ఈ ఎన్నికలలో వారు దానిని మార్చాలనుకుంటున్నారని చివరకు అంగీకరించారు,” అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

“ఈ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే పోరాటం. ఇది కేవలం పుస్తకమే కాదు, గాంధీ, అంబేద్కర్, నెహ్రూ జీల వేల సంవత్సరాల సైద్ధాంతిక వారసత్వం. మన రాజ్యాంగానికి ఇంత గొప్ప వారసత్వం కలిగి ఉంది” అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

Also Read: దీదీ ఈజ్ బ్యాక్.. ఇండియా కూటమిపై మమతా అనురాగం

ఈ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మార్చాలనే కోరికను బీజేపీ ఎట్టకేలకు అంగీకరించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తే రాజకీయ ప్రత్యర్థులు, లక్షలాది మంది పౌరుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. “నేను వారికి (బీజేపీ) చెప్పాలనుకుంటున్నాను (రాజ్యాంగాన్ని మార్చడానికి) మీకు ధైర్యం లేదు. మీరు ప్రయత్నిస్తే మీరు మమ్మల్ని, భారతదేశ ప్రజలను ఎదుర్కోవలసి ఉంటుంది” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుండగా.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×