BigTV English

Maxwell’s Disappointing Performnce in IPL 2024: ఆనాటి మ్యాక్స్ వెల్ ఎక్కడ?

Maxwell’s Disappointing Performnce in IPL 2024: ఆనాటి మ్యాక్స్ వెల్ ఎక్కడ?

Australian Cricketer Glenn Maxwell’s disappointing Performnce in IPL 2024 for RCB: 2023 వన్డే వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ .. అప్పటికి ఆఫ్గాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 91 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడు వచ్చాడు మ్యాక్స్ వెల్.. మామూలుగా ఆడలేదు. ఒక రేవు ఎట్టి వదిలేశాడు.


40 బాల్స్ లో సెంచరీ చేశాడు. అదే ఊపులో డబుల్ సెంచరీ చేశాడు. అంతేకాదు 201 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అటువైపు కెప్టెన్ కమిన్స్ నాటౌట్ గా నిలిచాడు. కేవలం 68 బంతులాడి 12 పరుగులు మాత్రమే చేశాడు. ఎంతసేపు మ్యాక్స్ వెల్ కి స్ట్రయికింగ్ ఇస్తూ చాలా వ్యూహాత్మకంగా వెళ్లాడు. అది ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ గా నిలిచిపోయింది.

అదే ఊపులో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ జరిగింది. అక్కడ కూడా ఇలాగే ధనాధన్ సెంచరీ చేశాడు. విదేశాల్లోని ఇతర లీగ్ మ్యాచ్ ల్లో కూడా అద్భుతంగా ఆడాడు. మ్యాచ్ విన్నర్ గా, ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించగల ధీరుడిగా పేరున్న మ్యాక్స్ వెల్ ఇక్కడెందుకు ఇలా ఆడుతున్నాడో ఎవరికి అంతుపట్టకుండా ఉంది.


Also Read: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన పోరాట యోధుడు.. దినేష్ కార్తీక్

2024 సీజన్ ఐపీఎల్ లో 10 మ్యాచ్ ల్లో చేసిన స్కోరు ఎంతంటే కేవలం 52 పరుగులు మాత్రమే. మ్యాచ్ ల వారీగా చూస్తే, 0, 16, 4, 0, 1, 0, 28, 3, 0 చేసిన పరుగులు ఇవి అని చెప్పాలి. వీటిలో చూస్తే నాలుగు మ్యాచ్ ల్లో డక్ అవుట్ అయ్యాడు. మరీ అంత దారుణంగా ఆడుతున్న మ్యాక్స్ వెల్ ని ఆడించకుండా ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు.

ఆస్ట్రేలియాకు ఎన్నోసార్లు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించిన మ్యాక్సీ ఇంత దారుణంగా ఆడటంతో అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఏమీ అనలేక కక్కలేక, మింగలేక అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు ఐపీఎల్ లో 134 మ్యాచ్ లు ఆడి 2771 పరుగులు చేశాడు. హయ్యస్ట్ స్కోరు 95గా ఉంది. 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆల్ రౌండర్ కావడంతో 37 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీ 156.73 స్ట్రయిక్ రేట్, యావరేజ్ 24.74గా ఉంది. కనీసం ఆ 24 పరుగులు చేసినా బాగుండేది…ఆర్సీబీ గెలిచి ఉండేదని అంటున్నారు.

ఇక సీజన్ ల వారీగా చూస్తే …
2024లో 52 పరుగులు, 2023లో 400 పరుగులు, 2022లో 301 పరుగులు, 2021 లో 513 పరుగులు చేశాడు. ఆర్సీబీ టైమ్ కూడా సరిగా లేదనే చెప్పాలి. అయితే ఒక్క మ్యాక్స్ వెల్ మాత్రమే కాదు, చాలామంది సరిగా ఆడలేదు. అందుకని తనొక్కడిని బాధ్యుడిని చేయడం సరికాదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Related News

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Big Stories

×