BigTV English

RahulGandhi: శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ.. నేతలతో భేటీ.. రాత్రి ఫేమస్ రెస్టారెంట్‌లో..

RahulGandhi: శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ.. నేతలతో భేటీ.. రాత్రి ఫేమస్ రెస్టారెంట్‌లో..

RahulGandhi: జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు నేతలతో సమావేశాలు, మరోవైపు ప్రజలతో మమేకం అవుతున్నారు. గతరాత్రి ఫేమస్ రెస్టారెంట్‌కు వచ్చిన ఆయన ఇష్టమైన వంటకాలను రుచి చూశారు.


జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అక్కడ అడుగుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో అహ్దూస్ ఫేమస్ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ తన సహచరులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ఆ తర్వాత లాల్ చౌక్‌లో ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో మమేకం అయ్యారు అగ్రనేత రాహుల్‌గాంధీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఏమైనా మార్పు వచ్చిందా అని వారిని అడిగారు. జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో రాజకీయ నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నరని చెప్పుకొచ్చారు.


ALSO READ:  ప్రముఖ హీరో కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరణ

శ్రీనగర్‌లో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే. గురువారం ఉదయం జమ్మూకాశ్మీర్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలను దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మీటింగ్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి తదుపరి అడుగులు వేయనున్నారు.

మరోవైపు జ‌మ్మూకాశ్మీర్ కాంగ్రెస్ – నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ మ‌ధ్య పొత్తు కుదిరే అవ‌కాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనుసరించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఎన్సీ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాలతో రాహుల్, ఖర్గే సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×