E-Paper
Advertisement

కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!

కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!
Advertisement

Organic Food: కల్తీ.. ఇప్పుడీ పేరు వినదే రోజు గడవని సిట్యుయేషన్. ఏ పదార్థా మైనా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. కెమికల్ ప్యాకెజ్డ్ ఫుడ్ అంటేనే భయపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల నుంచి కరీంనగర్ ప్రజలు ఇప్పుడు సరికొత్త అడుగులు వేస్తున్నారు. సేంద్రీయ, ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. జనాల అవసరాలను గుర్తిస్తూ నగర శివార్లలో ప్రాసెసింగ్ యూనిట్లు వెలుస్తున్నాయి. మన కండ్ల ముందే స్వచ్ఛమైన వంటనూనెలు, ఆహార పదార్థాలు అందిస్తుండడంతో కొనుగోలుదారులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.

కల్తీ ఫుడ్‌కు చెక్.. ఇంజనీరింగ్ యువకుడు

Advertisement

కల్తీ ఫుడ్‌కు చెక్ పెట్టేలా రంగంలోకి దిగాడు ఇంజనీరింగ్ చదివిన యువకుడు మధు. కొత్తపల్లిలో రైతువారధి పేరుతో గానుగ నూనె, స్వచ్ఛమైన ఆహార పదార్థాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. కండ్ల ముందే తీసే గానుగ నూనె, స్వచ్ఛమైన పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్నాడు. పాతకాలం నాటి ఇసురు రాయిపై ఇసిరిన పప్పులను ఇక్కడ అందిస్తున్నాడు. పాత రుచులతోపాటు అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాడు. మధు ప్రయత్నానికి కరీంనగర్ ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

స్వచ్ఛ మైన ఆహారం కోసమే..

Advertisement

ఈ రోజుల్లో ఆహారమంతా కల్తీ అవుతోంది. ప్యాకేజ్డ్ ఫుడ్ తిని రోగాల బారిన పడుతున్నారు. వారికోసం.. కల్తీలేని స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడానికే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామంటున్నాడు నిర్వాహకుడు మధు. కళ్ల ముందే నాణ్యతమైన పదార్థాలు ఇస్తుండడంతో ఆదరణ బాగానే ఉందంటున్నాడు. ఏదిఏమైనా ప్యాకెజ్డ్ ఫుడ్ నుంచి ప్రజలు ఆర్గానికి వైపు అడుగులు వేస్తుండడం మంచి పరిణామమనే చెప్పుకోవచ్చు.

Also Read: 20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×