Delhi Elections Results: ఆప్‌ని భారీగా దెబ్బ తీసిన ప్రధాన అంశమేంటి? ఆప్ ఢిల్లీ ఓటర్ల ముందు అడ్డంగా ఎందుకు బుక్ అయ్యింది? ఇందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కారణంగా నిలిచిందంటారు ఎందుకని? ఆప్ డిఫీట్ లో మెయిన్ ఫీట్ ఏంటి? లెట్స్ వాచ్.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి లిక్కర్ స్కామ్ అతి పెద్ద కారణంగా భావిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టినా.. అదే అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపణలు రావడం.. ఆ పార్టీ కొంపముంచిందని అంచనా వేస్తున్నారు. పార్టీలో నెంబర్‌వన్, నెంబర్‌టూ పొజిషన్లో ఉన్న ఇద్దరు నేతలు సహా, మరో కీలక నేతపై లిక్కర్ అవినీతి ఆరోపణలు రావడం.. పార్టీని తీవ్రంగా దెబ్బతీసినట్టుగా చెబుతున్నారు. దీంతోనే ఆప్ కీలక నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ దారుణంగా ఓడిపోయారనీ అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో BRS MLC కవితతో కుమ్మక్కై.. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు నేతలు చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. పార్టీలో కీలక నేతలైన ఆ ఇద్దరి మీదే అవినీతి ఆరోపణలు రావడం, వాటిని ఇద్దరూ సరిగ్గా తిప్పికొట్టలేకపోవడంతో.. నిజంగానే అవినీతికి పాల్పడ్డారేమో? అనే అనుమానాలు వెలుగు చూశాయి. అందుకే కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను జనం తిరస్కరించారని అంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకి తోడు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సత్యేంద్ర జైన్‌కు కూడా ఇదే ఫలితం ఎదురైంది. ఆయన్ని కూడా ఢిల్లీ ఓటర్లు ఘోరంగా ఓడించారు. ఢిల్లీలో ఆప్ ఓటమి వీళ్ల ముగ్గురే ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. వీళ్లు ముగ్గురు మినహా.. మిగతా ఆప్ నేతలపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు, ప్రజల్లో వ్యతిరేకత కూడా లేదు. కేవలం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల మీద వచ్చిన ఆరోపణల ఎఫెక్ట్.. మిగతా ఆప్ అభ్యర్థుల మీద కూడా పడింది. ఇది చివరికి.. ఆప్ ప్రభుత్వం ఢిల్లీ గద్దె దిగేలా చేసింది.
Also Read: ఆప్‌ని ఓడించాలంటే ప్రధాని మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది.. కేజ్రీవాల్ వైరల్ వీడియో
ఈ మొత్తం డిఫీట్‌లో లిక్కర్ అవినీతే అతి పెద్ద కారణంగా తెలుస్తోంది. కాగ్ కూడా ఈ లిక్కర్ పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ. 2, 026 కోట్ల నష్టంగా తేల్చడంతో.. ఢిల్లీ ఓటర్లు ఆప్ ని ఊడ్చి అవతల పడేశారనీ అంటున్నారు. 2021 నవంబర్ 17న ప్రవేశ పెట్టిన మద్యం పాలసీ.. 2022 సెప్టంబర్ లో వెనక్కు తీస్కున్నా.. జరగాల్సిన నష్టం భారీగానే జరిగింది. ఇటు ఆప్ అగ్రనేతలు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వంటి వారి అరెస్టులు జైలు ఎపిసోడ్లు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం. ఈ పాలసీ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఇటు మంత్రి మండలి, అటు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదన్న ఆరోపణలకు సరైన వివరణలు ఇచ్చుకోలేక పోయింది ఆప్. దీంతో ఇంతటి దారుణమైన నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని అంచనా.