Mumbai-Mauritius Flight: ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్ కు వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థతి తలెత్తింది. అందులో ఏసీ పని పని చేయకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా వృద్దులు, చిన్నారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి ఎంకే 749 విమానం ఈ తెల్లవారు జామున 4:30గంటలకు మారిషస్ బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులందరిని ఎక్కించారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్ లో సమస్య ఏర్పడింది.దీంతో ఆ విమానాన్ని రన్ వే పైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5గంటల పాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడిన వానిని వెంటనే కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలియజేశారు. అయితే ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు కాన, ఎయిర్ మారిషస్ గానీ ఎలాంటి ప్రనకటన చేయలేదు.