IMD Warns Severe Heatwave in Across the India : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మొదలు సాయంత్రం 7 అయినా కూడా ఆ ఎండ వేడిమి తగ్గట్లేదు. మధ్యాహ్నం సమయంలోనైతే కనీసం అడుగు బయటపెట్టాలంటేనే జనం అల్లాడుతున్నారు. అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే… ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ తాజాగా ఓ సూచన చేసింది. మరో ఐదురోజులపాటు ఎండలు మండిపోనున్నాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో బహర్గోరా జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
అయితే, వచ్చే 5 రోజులపాటు బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, యూపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు పలు యూనియన్ టెర్రీటరీస్ లలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురువొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఝార్కండ్ ప్రభుత్వం పాఠశాలల సమయ వేళల్లో మార్పులు చేసింది. ఇటు ఒడిశా సర్కారు సమ్మర్ వెకేషన్స్ ను ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఎండాకాలం సెలవులని పేర్కొన్నది. అదేవిధంగా ఈ మూడు రోజులపాటు కూడా పాఠశాలల సమయ వేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే.
Also Read: భానుడి ప్రతాపం.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయ్..
రాష్ట్రంలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండలకు భయపడి పనులకు వెళ్లేవారు ఉదయాన్నే వెళ్తున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లేవాళ్లు ఎండల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పగలంతా తీవ్రమైన ఎండ, రాత్రి పూట ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు.