Jr NTR, Salman khan, Rashmika Mandanna and Others Celebs Airport Look: ఈ మధ్య బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీతో సహా టీవీ ఇండస్ట్రీ వరకు సెలబ్రిటీలు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందమైన లుక్‌లో కనిపించి కనువిందు చేశారు. పవర్‌ఫుల్ స్లైల్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. తమ అభిమాన నటీ, నటుల్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు. అందులో సల్మాన్ ఖాన్, రష్మిక, ఎన్టీఆర్‌తో సహా మరికొంత మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వాటికి సంబంధించి ఎవరెవరు ఈ మధ్య ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల బ్యూటీ డైసీ షా. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బ్యూటీఫుల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేసింది. చాలా సింపుల్ లుక్‌లో వావ్ అనేలా ఉంది. లైట్ గ్రీన్ టీ షర్ట్‌లో సింపుల్ అండ్ కూల్ లుక్‌లో అందరినీ ఫిదా చేసింది.
Also Read: సైలెంట్‌గా ‘మసూద’ నటుడి పెళ్లి.. ఫొటోలు వైరల్
అలాగే ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన బాలీవుడ్ దబాంగ్ సల్మాన్ ఖాన్ కూడా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ఈ సమయంలో సల్మాన్ ఖాన్ బ్లాక్ కలర్ షర్ట్, వైట్ ప్యాంటుతో.. బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. అయితే అదే సమయంలో ఆయనతో పాటు చాలామంది సెక్యూరిటీ వాళ్లు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సల్మాన్ లుక్ అందరికీ బాగా నచ్చేసింది.
‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన కూల్ లుక్‌తో అదిరిపోయాడు. వైట్ షర్ట్ – జీన్స్‌తో కనిపించి కనువిందు చేశాడు. అయితే అతడు ‘వార్2’ మూవీ కోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ తాజా షెడ్యూల్‌లో హృతిక్ – ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Kamal Haasan: స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం..
అలాగే రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’మూవీతో ఓవర్ నైట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన రష్మిక మందన్న కూడా ఇటీవల ముంబై విమానాశ్రయంలో కనిపించింది. నటి బ్లాక్ డ్రెస్‌లో మాచింగ్ సన్‌గ్లాస్ పెట్టుకుని క్యూట్‌గా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
‘బిగ్ బాస్ 16’ కంటెస్టెంట్ శివ్ ఠాక్రే కూడా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అతడు పింక్ కలర్ షర్ట్, జీన్స్‌తో వైట్ షూ ధరించి కనిపించాడు. అతడి స్టైల్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది.