BigTV English

Sanjay Raut: హర్యానాలో ఓటమికి కాంగ్రెస్‌దే బాధ్యత.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Sanjay Raut: హర్యానాలో ఓటమికి కాంగ్రెస్‌దే బాధ్యత.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Shiv Sena (UBT) criticises ally Congress: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి భాగస్వామి శివసేన (యూబీటీ) ఒంటరిగా పోటీ చేయాలనే పార్టీ నిర్ణయాన్ని విమర్శించింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒంటరి పోరాటమే కారణమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.


కాంగ్రెస్ ఒంటరిగా కాకుండా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. ఒకవేళ కాంగ్రెస్ దేశమంతటా ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే.. ఇతర పార్టీలు తమ రాష్ట్రాల్లో సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సీట్ల పంపకాల విషయంపై శివసేన(యూబీటీ), కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత చోటుచేసుకుంటుండగా.. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం మిత్రపక్షాల పట్ల వైఖరి కారణమని శివసేన(యూబీటీ) పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ఆర్టికల్ 370 రద్దు చేయగానే ఓడిపోయిందన్నారు. అక్కడ కాంగ్రెస్ పొత్తుతో పోరాడినందున గెలుపొందిందన్నారు. కానీ హర్యానాలో ఇండియా కూటమి విజయం సాధించలేకపోయిందన్నారు.

Also Read:  సీఎం ఇంట్లో సామాన్లు బయటకు విసిరేసిన అధికారులు? మరీ ఇంత దారుణమా!

కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఒంటరిగా వెళ్లి కూటమి భాగస్వాములను విస్మరించిందన్నారు. ఒకవేళ సమాజ్ వాద్ పార్టీతో పొత్తు ఉన్నట్లయితే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. అయితే బీజేపీ పోరాడిన తీరు బాగుందని కొనియాడారు. అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారని, కానీ చివరికి ఓటమి చెందిందన్నారు. మహారాష్ట్రలో అలా జరిగే అవకాశం లేదని, ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తయ్యాయన్నారు.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×