E-Paper
Advertisement

దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!

దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!
Advertisement

Southern Zonal Council: తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో దక్షిణ మండలి (సదరన్‌ కౌన్సిల్‌) 31వ సమావేశం జరిగింది. ఈ భేటిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బుల్లెట్ రైలు కారిడార్ ను తెరపైకి తీసుకురాగా.. తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

సీఎం విజయ్ వ్యాఖ్యలు..

ఈ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతూ.. కర్ణాటకతో ఉన్న కావేరి జలాల వివాదాన్ని ప్రస్తావించారు. జలాల వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పులు, అథారిటీ నిర్ణయాలను అమలు చేయాలన్నారు. మరోవైపు నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు, తమ రాష్ట్ర కోట ఎంబీబీఎస్ సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేయడం, డీలిమిటేషన్ పై తమకున్న అభ్యంతరాలను షా ముందు విజయ్ ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతాలకు సంబంధించిన బ్లూ ఎకానమీలో భాగస్వామ్యానికి తమిళనాడు సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు న్యాయమైన ఆర్థిక వాటాను కల్పించాలన్నారు.

కర్ణాటక సీఎం ఏమన్నారంటే..

Advertisement

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం కావేరి జలాల సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. నీటి విషయంలో సమానత్వం, పారదర్శకత, సహకారం కీలకమన్నారు. మరోవైపు డీలిమిటేషన్‌లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించొద్దని సూచించారు. 1971 జనాభా ప్రాతిపదికను కొనసాగించాలన్నారు. 15వ ఆర్థిక సంఘంలో కర్ణాటక వాటా 4.7 నుంచి 3.6 శాతానికి తగ్గిందని.. దానిని తిరిగి పెంచాలని డిమాండ్ చేశారు. బెంగళూరు – ముంబయి నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కావాలని పట్టుబట్టారు. ఖనిజ వనరులపై రాష్ట్రాల పన్ను హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య విధానం మరింత బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. ‘న్యాయమైన నిధులు.. న్యాయమైన గొంతు.. రాష్ట్రాలకు తగిన గౌరవం’ కావాలని డీకే డిమాండ్ చేశారు.

Also Read: అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

కేరళ సీఎం స్పీచ్..

Advertisement

కేరళ సీఎం వీడీ సతీశన్ భేటిలో మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ భారత్‌ నిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కోసం తాము రూ.1,493 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చింది రూ.151 కోట్లే అని అన్నారు. రాష్ట్రాల వినియోగాన్ని బట్టి ప్రీమియం నిర్ణయించాలన్నారు. అలాగే ప్రజా రవాణా సంస్థలకు టోల్‌ మినహాయింపు ఇవ్వాలని అమిత్ షాను కోరారు. మరోవైపు కేరళ తీరంలోని 63 శాతం ప్రాంతం కోతకు గురవుతోందని.. తీర రక్షణకు NDRF, SDRF నిధులు వినియోగించేందుకు అనుమతివ్వాలన్నారు. రైలు మార్గాల పనులు వేగవంతంతో పాటు.. అటవీ మార్గాంలో రాకపోకలపై పూర్తి నిషేధం వద్దని సూచించారు. కాన్వాయ్‌ విధానంలో వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండా తమ రాష్ట్రంలోని  మైనింగ్ బ్లాకుల వేలం నిర్వహించవద్దని కేంద్రానికి కేరళ సీఎం సూచించారు.

Also Read: వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

Tags

Related News

వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

ప్రభుత్వం బంపరాఫర్.. పథకాలు ప్రమోట్ చేస్తే.. ఒక్కో వీడియోకు రూ.లక్ష బహుమానం!

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. దిల్లీలోని పాక్ హైకమిషన్‌పై బుల్డోజర్ యాక్షన్!

ఐఫోన్, బైక్ కోసం.. ప్రియుడితో కలిసి తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక!

ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి

Big Stories

Advertisement
×