E-Paper
Advertisement

హ్యారీ బ్రూక్ లాంటి వెధ‌వ‌ల‌ను మ‌ళ్లీ ఐపీఎల్ లోకి రానివ్వొద్దు !

హ్యారీ బ్రూక్ లాంటి వెధ‌వ‌ల‌ను మ‌ళ్లీ ఐపీఎల్ లోకి రానివ్వొద్దు !
Advertisement

Harbhajan Singh On Harry Brook: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ప్రతి ఒక్క వెధవా, కించపరుస్తూ మాట్లాడడం ఈ మధ్య విపరీతంగా పెరిగింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అయితే ప్రతి రోజు సోషల్ మీడియా వేదికగా విషం కక్కుతూనే ఉన్నారు. అయితే అప్పట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను విమర్శించిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఇప్పుడు మళ్లీ మాట మార్చాడు. తనపై ఉన్న నిషేధం తొలగిన తర్వాత ఐపీఎల్ టోర్నమెంటులో ఆడతానని ప్రకటించాడు. అయితే అతడు ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హ్యారీ బ్రూక్ ( Harry Brook) లాంటి వెధవలను మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకోకూడదని ఫ్రాంచైజీలను కోరారు. విశ్వాసం లేకుండా ఐపిఎల్ ను కించపరుస్తూ గతంలో బ్రూక్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ముఖ్యంగా కావ్య పాప అతిగా ఆశపడి హ్యారీ బ్రూక్ ను కొనే ప్రమాదం ఉందని.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అత్యాశకు వెళ్లొద్ద‌ని కోరారు.

కావ్య‌కు హ‌ర్భ‌జ‌న్ హెచ్చ‌రిక‌…బ్రూక్ లాంటి వాళ్ల‌ను గెంటేయండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి మళ్లీ వస్తానని హ్యారీ బ్రూక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హర్భజన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఐపీఎల్ కంటే జాతీయ జట్టు తనకు చాలా ముఖ్యమంటూ కామెంట్ చేసిన హ్యారీ బ్రూక్, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడని ఫైర్ అయ్యారు. ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించి.. గతంలో విషం కక్కిన వీడిని మళ్లీ రానివ్వకూడదని హెచ్చరించారు. అతిగా ఆశపడి కావ్య పాప… అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినట్లుగానే హ్యారీ బ్రూక్ ను వేలంలో కొంటుందని మండిపడ్డారు. ఐపీఎల్ టోర్నమెంట్ కు వెన్నుపోటు పొడిచిన వాడిని అస్సలు కొనుగోలు చేయకూడదని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఆమెతో పాటు మిగిలిన ఫ్రాంచైజీలు కూడా, హ్యారీ బ్రూక్ ను అస్సలు కొనొద్దని కోరారు. అప్పుడే ఐపిఎల్ విలువ అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. వేలంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినా కూడా, మెడలు పట్టి గెంటేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ఐపీఎల్ లోకి హ్యారీ బ్రూక్ రీ- ఎంట్రీ ( Harry Brook Re-entry) 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సందర్భంగా హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ.6.25 కోట్లు పెట్టి అతడిని, తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే సీజన్ ప్రారంభం కాగానే జాతీయ జట్టు కోసం ఐపీఎల్ ను వదిలేశాడు. తనకు జాతీయ జట్టు ముఖ్యమంటూ ప్రకటించి వెళ్లిపోయాడు. డబ్బులు కూడా నొక్కేశాడు. అటు 2024 సీజన్ మధ్యలో తన అమ్మమ్మ చనిపోయిందని వెళ్ళిపోయాడు. ఇలా రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తీవ్రంగా నష్టపరిచాడు హ్యారీ బ్రూక్.

Advertisement

ఈ క్రమంలో అతనిపై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది IPL యాజమాన్యం. ఇక లేటెస్ట్ గా తన బ్యాన్ గురించి స్వయంగా హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాన్ ముగిసిన వెంటనే మళ్ళీ IPL ఆడుతానని వెల్లడించారు. ఐపీఎల్ ఆడేందుకు తాను ఎంతో ఆతృతగా ఉన్నానని పేర్కొన్నారు. గతంలో చిన్న చిన్న కారణాల వల్ల ఐపిఎల్ వదిలేసుకొని చాలా తప్పు చేశానని ఒప్పుకున్నారు. దీంతో హ్యారీ బ్రూక్ రీ ఎంట్రీ పై చర్చ మొదలైంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఐపిఎల్ 2028లో హ్యారీ బ్రూక్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

నీకు టీమిండియా కంటే పెళ్లాం ఎక్కువైందా ? కోహ్లీపై దారుణంగా ట్రోల్స్ !

ముంబై ఇండియ‌న్స్ ఒక్క మ్యాచ్ గెల‌వొద్దు…స‌ర్వ నాశ‌నం కావాలి

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Big Stories

Advertisement
×