E-Paper
Advertisement

సీజేపీ నిరసన మధ్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మెట్రో-ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశం

సీజేపీ నిరసన మధ్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మెట్రో-ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశం
Advertisement

Supreme Court: ఢిల్లీలో మెట్రో, రైలు సర్వీసులు నిలిపివేత, ఇంటర్నెట్‌పై కఠిన ఆంక్షలపై సుప్రీంకోర్టు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని పేర్కొంది ధర్మాసనం. శాంతిభద్రతల సమస్య తీవ్రమయ్యే వరకు మెట్రో సేవలు యథాతథంగా నడవాలని ఆదేశించింది. ప్రజా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో సేవలను కొనసాగించాలని తెలిపింది. నిలిపి వేసిన ఇంటర్‌నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సీఈసీ రాజీనామాపై చేస్తున్న నిరసనల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను వెంటనే తొలగించాలని ప్రస్తావించింది. విధులకు హాజరయ్యే న్యాయవాదుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని తేల్చి చెప్పేసింది.  నిరసన తెలిపే హక్కు ప్రాథమిక హక్కు అని ధర్మాసనం పేర్కొంది. BNSSలోని సెక్షన్ 163 కింద ఉన్న ఆంక్షలను తొలగించాలని ఆదేశించింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఆంక్షలకు సంబంధించి సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు. ఎన్నికల వ్యవస్థ అన్యాయంగా ఉందని భావించడం వల్ల యువత, చట్టబద్ధమైన నిరసనలకు దిగారని తెలిపారు.

మెట్రో రైలు, ఇంటర్నెట్ పునరుద్ధరించాలని ఆదేశం

Advertisement

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ శనివారం ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా అధికారులు భారీ ఆంక్షలు విధించింది కేంద్రం.  వాటిపై నిరసనకారులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వీటిపై ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ముందు ఆయా పిటిషన్లు వచ్చాయి. విచారణ సందర్భంగా  303 మెట్రో స్టేషన్లలో శనివారం కేవలం 45 స్టేషన్లను మూసివేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

ఒక స్టేషన్‌ మూసివేస్తే పొరుగునున్న స్టేషన్‌ ఓపెన్ చేసి ఉందన్నారు. మెట్రో స్టేషన్లు తెరిచి ఉంటాయని, ఇంటర్నెట్‌ను పునరుద్ధరిస్తామని, లాయర్లు విధులు నిర్వహించకుండా అడ్డుకోబోమని, సాధారణ రాకపోకలు కొనసాగిస్తామని ఎస్జీ చేసిన వాదనలను రికార్డు చేసుకుంటున్నామని ధర్మాసనం వెల్లడించింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. అక్టోబర్ 10న ఏ తరహా ఆంక్షలు విధించారు? అందుకు కారణాలేంటి? అనేదానిపై వచ్చేవారం పూర్తి వివరాలు అఫిడవిట్‌లో వేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.

Advertisement

ALSO READ: ఆదివారం సీజేపీ నిరసనలు.. జంతర్ మంతర్ వద్దకు రావాలని పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు

Related News

ఆదివారం సీజేపీ నిరసనలు.. జంతర్ మంతర్ వద్దకు రావాలని పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, తగలబడిన ఇళ్లు- దుకాణాలు, తొమ్మిది మంది మృతి

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

Big Stories

Advertisement
×