Best Water Heaters: చలికాలం వచ్చేస్తోంది.. ఇక ఇంట్లో వేడి నీటి అవసరం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో పాత గీజర్‌ను మార్చాలనుకుంటున్నా లేదా కొత్త గీజర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి 15 లీటర్ల స్టోరేజ్ గీజర్లు మంచి ఎంపిక. ముఖ్యంగా చిన్న కుటుంబాలకు సరిపోయే ఈ గీజర్లు తక్కువ స్థలంలోనే అమర్చుకోవచ్చు. రోజువారీ అవసరాలకు సరిపడా వేడి నీటిని అందించడంతో పాటు, 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో విద్యుత్ ఆదాకు కూడా సహాయపడతాయి. ఈ పండగ సీజన్‌లో హార్డ్ వాటర్ ప్రొటెక్షన్, రస్ట్ రెసిస్టెన్స్, సేఫ్టీ ఫీచర్లు ఉన్న గీజర్ కోసం చూస్తున్నట్లయితే.. మార్కెట్‌లోని ఈ టాప్ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి.
ఎక్కువ కాలం మన్నికగా ఉండే గీజర్ కావాలనుకునే వారికి ఏవో స్మిత్ విఏఎస్ ప్లస్ మంచి ఎంపిక. దీనికి 5-స్టార్ బిఈఈ రేటింగ్ ఉంది. కాబట్టి కరెంట్ బిల్లుల గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఇందులో ఉపయోగించిన బ్లూ డైమండ్ గ్లాస్ లైన్డ్ ట్యాంక్ నీటి వల్ల ట్యాంక్ త్వరగా పాడవకుండా, రస్ట్ పట్టకుండా కాపాడుతుంది. దీని ఇన్నర్ ట్యాంక్‌పై 7 ఏళ్ల వారంటీ లభిస్తుంది.
మీరు ఉండే ప్రాంతంలో ఉప్పు నీరు లేదా హార్డ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంటే హావెల్స్ మోంజా ప్రోను పరిశీలించవచ్చు. దీనికి గ్లాస్ కోటెడ్ యాంటీ రస్ట్ ట్యాంక్, ప్రత్యేకమైన హీటింగ్ ఎలిమెంట్ రావడం వల్ల ఉప్పు నీటి ప్రభావం పడదు. ఇందులో ఉన్న వర్ల్‌ఫ్లో టెక్నాలజీ నీటిని వేగంగా వేడెక్కించడానికి సహాయపడుతుంది. ఇది అపార్ట్‌మెంట్లు, హైరైజ్ బిల్డింగ్‌లకు కూడా బాగా సెట్ అవుతుంది.
Also Read: వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?
వి-గార్డ్ జియో గీజర్ మన భారతీయ ఇళ్లలోని నీటి పరిస్థితులకు తగినట్లుగా డిజైన్ చేయబడింది. 15 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ గీజర్‌కి 5-స్టార్ రేటింగ్ ఉంది. ఇది కూడా ఉప్పు నీటి వల్ల పాడవకుండా మల్టీ లేయర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. 8 బార్ వరకు వాటర్ ప్రెజర్ తట్టుకోగలగడం వల్ల ఎత్తైన భవనాల్లో ఉండే వారికి ఇది సరైన ఛాయిస్. దీని ట్యాంక్‌పై 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది.
ఎక్కువ హడావుడి లేని సింపుల్ అండ్ బెస్ట్ గీజర్ కావాలనుకుంటే ఓరియంట్ ఎనామర్ క్లాసిక్ ప్రో మంచి ఆప్షన్. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో రావడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. రోజువారీ వాడకానికి, ఎత్తైన బిల్డింగ్‌లలో అధిక వాటర్ ప్రెజర్‌ను తట్టుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. బేసిక్ సేఫ్టీ, మంచి మన్నిక కోరుకునే వారికి ఇది సరిపోతుంది.
బజాజ్ షీల్డ్ న్యూ శక్తి చాలా కాలంగా మార్కెట్‌లో నమ్మకమైన మోడల్‌గా ఉంది. దీని ట్యాంక్‌పై 7 ఏళ్లు, హీటింగ్ ఎలిమెంట్‌పై 6 ఏళ్ల సుదీర్ఘ వారంటీ ఇస్తున్నారు. ఇందులో పిల్లల రక్షణ కోసం చైల్డ్ సేఫ్టీ మోడ్ ఉంది. ఉప్పు నీటి నుంచి రక్షణ ఇచ్చే షీల్డ్ టెక్నాలజీ వల్ల వాటర్ త్వరగా వేడెక్కుతుంది.
Also Read: గూగుల్ అకౌంట్ అక్కర్లేదు.. బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు!