E-Paper
Advertisement

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?
Advertisement

Infested Dry Fruits: స్వేచ్చ బ్యూరో: పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ డ్రై ఫ్రూట్స్ షాపులో నాణ్యత లేని, పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్నారని కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన పవన్ కుమార్ ఆరోపించారు. ఇలాంటి ఆహార పదార్థాల విక్రయాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

షాపులో డ్రై ఫ్రూట్స్..

పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం సదరు షాపులో డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా పురుగులు ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. దీంతో షాపు యజమానిని నిలదీయగా, తన తప్పును అంగీకరించకుండా, కొనుగోలు చేసిన వస్తువులను తిరిగి తీసుకునేది లేదని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పినట్లు పవన్ కుమార్ ఆరోపించారు. అనంతరం ఇతర కస్టమర్లు కూడా డ్రై ఫ్రూట్స్‌ను పరిశీలించగా, వాటిలో పురుగులు ఉన్నట్లు గుర్తించారని బాధితుడు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..

Advertisement

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించడం సరికాదని ఆయన అన్నారు. సంబంధిత ఆహార భద్రతా అధికారులు సదరు షాపులో విక్రయిస్తున్న డ్రై ఫ్రూట్స్ నాణ్యతను తనిఖీ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

Tags

Related News

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

హరీశ్ రావు పరువు నష్టం దావా కేసు.. కాంగ్రెస్ అగ్రనేతలకు కోర్టు సమన్లు!

కాంగ్రెస్ మూడేళ్ల పాలన ఫెయిల్.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం: కవిత

Big Stories

Advertisement
×