BigTV English

Supreme Court: తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్.. డెడ్ లైన్ 24 గంటలు, ఎందుకు..?

Supreme Court: తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్.. డెడ్ లైన్ 24 గంటలు, ఎందుకు..?
SUPREME COURT RAPS TAMILANADU GOVERNOR RN RAVI
SUPREME COURT RAPS TAMILANADU GOVERNOR RN RAVI

Supreme Court Raps Tamil Nadu Governor RN Ravi: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. గవర్నర్ వ్యవహారశైలిని తప్పుబట్టింది. ఆయన తీరు చాలా ఆందోళనకరంగా ఉందని ఆక్షేపించింది. ఆయన సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారని హెచ్చరించింది.


తమిళనాడు మాజీ మంత్రి పొన్నుడిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు గవర్నర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై స్టాలిన్ సర్కార్ న్యాయస్థానం తలుపుతట్టింది. ఈ పిటీషన్ పై ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 24గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మా మాట వినకుంటే రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ఆగ్రహం వ్యక్తంచేసింది.

గవర్నర్ ప్రవర్తనకు తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. అడ్వైజర్లు ఆయనకు సరిగా సలహాలు ఇవ్వట్లేదని పేర్కొంది. వ్యక్తి లేదా మంత్రిపై మనకు భిన్నాభిప్రాయాలు ఉంచవచ్చని, పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్దంగా నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. అసలు కేసులో వివరాల్లోకి వెళ్తే.. ఆదాయానికి మించి ఆస్తులు కేసులో డీఎంకే నేత, మాజీమంత్రి పొన్ముడి, ఆయన వైఫ్ విశాలాక్షికి మద్రాస్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడింది.


హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మాజీమంత్రి. సుప్రీంకోర్టు ఆయన జైలు శిక్షను నిలుపుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవి మళ్లీ దక్కించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత అయిన పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ భావించారు. ఈ విషయమై గవర్నర్ ఆర్ఎన్ రవికి తెలిపారు. ఇందుకు గవర్నర్ ససేమిరా అన్నారు. గవర్నర్ వ్యవహారశైలిపై స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని పేర్కొంది.

గతంలోకి వెళ్తే.. గవర్నర్ ఆర్ఎన్ రవి – స్టాలిక్ ప్రభుత్వానికి మధ్య వివాదాలు చాలానే ఉన్నాయి. గవర్నర్ వ్యవహారశైలిపై రాష్ట్రపతి ముర్ముకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. గవర్నర్ పదవికి ఆయన అనర్హులని, ఆ పదవి నుంచి తొలగించాలని అందులో ప్రస్తావించారు. స్టాలిన్ కేబినెట్ లో మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత మంత్రివర్గం నుంచి ఆయన్ని తొలగిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు గవర్నర్. బీజేపీయేతర పార్టీల ఆందోళనతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు తమిళనాడు శీతాకాల అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయారు గవర్నర్ ఆర్ఎన్ రవి. దీనిపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెల్సిందే.

Tags

Related News

Modi New Strategy: మళ్లీ తెరపైకి మేడ్ ఇన్ ఇండియా.. మోదీ స్వదేశీ మంత్రం ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావితం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×