BigTV English

Razakar: రజాకార్ సినిమా నిర్మాతకు 1,100 బెదిరింపు కాల్స్.. సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం

Razakar: రజాకార్ సినిమా నిర్మాతకు 1,100 బెదిరింపు కాల్స్.. సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం
Guduru Narayana Reddy
Guduru Narayana Reddy

Razakar Movie: రజాకార్ సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన పోలీసులతో పాటుగా కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కేంద్రం నిఘా వర్గాల ద్వారా దర్యాప్తు జరిపి ఆయనకు భద్రతను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది.


రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే సంచలనంగా మారిన సినిమా రజాకార్. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను బేజీపీ నేత, సినిమా నిర్మాత గూడురు నారాయణ రెడ్డి నిర్మించారు.అయితే ఈ చిత్రాన్ని నిలుపుదలచేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాత నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేశారు. తనకు దాదాపు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆయన కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. నారాయణ రెడ్డి ఫిర్యాదుపై వెంటనే కేంద్రం స్పందించింది. ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

నిఘా వర్గాల ద్వారా తమకు అందిన సమాచారం మేరకు నారాయణ రెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజాం కాలంలో హైదరాబాద్ లో జరిగిన దారుణ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు.


Also Read: Japan earthquake: జపాన్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న స్టార్ డైరెక్టర్ కొడుకు

ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్యాజ్ కీలక పాత్రలో పోషించారు. ఈమెతో పాటుగా బాబీ సింహా, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే, అనుష్యా త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల దృష్ట్యా విడుదల కాలేకపోయింది. దీంతో ఈ సినిమాను మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందే దీన్ని విడుదల ఆపాలని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×