BigTV English

Same Gender Marriage Act In India: కోర్టు ఓకే చెప్తే.. వీళ్ల పెళ్లిళ్లకు లైన్ క్లియర్..

Same Gender Marriage Act In India: కోర్టు ఓకే చెప్తే.. వీళ్ల పెళ్లిళ్లకు లైన్ క్లియర్..

సేమ్ జెండర్ వెడ్డింగ్స్ అంటే.. అబ్బాయి-అబ్బాయి పెళ్లి చేసుకోవడం, అమ్మాయి -అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం. ఈ మధ్య కాలంలో ఈ ట్రెంట్ బాగా నడుస్తోంది. అందుకే చాలా దేశాల్లో వీటికి చట్టబద్ధత కల్పించారు. అనేక దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్లు కుప్పలుగా జరుగుతున్నాయి. మనదేశంలో వీటికి చట్టం లేదు.. అంతేకానీ ఇలాంటి రిలేషన్స్ అనేకం.

యూరప్ కంట్రీస్ తో పాటు.. అమెరికా లాంటి ఆగ్రరాజ్యాల్లో ఇవీ లీగల్ .. వీటికంటూ ఓ చట్టం కూడా ఉంది. మన దేశంలో కూడా వీటిని చట్టం చేయాలని చాలా మంది సుప్రీంకోర్టెక్కారు. ఈ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతూ 21 పిటిషన్లు దాఖలు పిల్లల్ని దత్తత తీసుకోవడం, పిల్లల తల్లిదండ్రులుగా పేర్లు నమోదు చేసుకోవడం.


వారసత్వ ప్రయోజనాలు వంటి పలు అంశాలపై హక్కు కల్పించాలని పిటిషన్లు వేశారు. వీటిపై గతేడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు విచారించి తీర్పు చెప్పింది. గే వివాహాలను చట్టబద్దత కల్పించలేమని తేల్చింది. ఎందుకంటే అది చట్టానికి సంబంధించిన విషయం. ఆ చట్టాలు చేయాలంటే చట్టసభల్లో బిల్లులు పాస్ కావాలి. ఆ చట్టాలు తాము చేయలేమని .. అందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చేచెప్పింది.

Also Read: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం..

కోర్టు.. చట్టాల సంగతీ ఎలా ఉన్నా .. వెస్ట్రన్ కంట్రీస్ లో లాగా.. మన దేశంలో ఈ కల్చర్ పాపులర్ అవుతోంది. అంతెందుకు ఈ మధ్య ఓపెన్ గానే ఎల్‌జీబీటీక్యూ గ్రూపులు ఏర్పడ్డాయి. పార్టీలు వగేరా హ్యాపనింగ్స్ తో చిల్ అవుతున్నారు. మరోవైపు తమ హక్కుల కోసం కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకే మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు మళ్లీ. పార్లమెంటుకు వెళ్తుందనుకున్న బాల్ మళ్లీ వచ్చి కోర్టులోనే పడింది. తీర్పును మళ్లీ ఓసారి చూడాలని పిటిషన్లు వేశారు. దీంతో ఈ నెల 10న సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే దానిపి ఉత్కంఠగా మారింది.

ఒకవేళ కోర్టు వీరికి అనుగుణంగా జడ్జ్ మెంట్ ఇస్తే.. వీళ్ల కమ్యూనిటీ ఫుల్ హ్యాపీ.. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు జరిగిన ఈ పెళ్లిళ్లు ఇకపై బహిరంగగా నడుస్తాయి. చూడాలి వీరి పోరాటానికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందో..

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×