BigTV English

Supreme court on Gyanvapi case : జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Supreme court on Gyanvapi case : జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
Gyanvapi masjid case latest news

Gyanvapi masjid case latest news(Breaking news of today in India) :

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు సర్వే ప్రారంభించారు. మసీదుకు చేరుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా వారణాసిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ సర్వేను నిలిపివేయాలని ముస్లిం కమిటీ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మసీదును హిందూ ఆలయంపై నిర్మించారో లేదో తేల్చాలని ASIను ఆదేశించింది.


మరోవైపు అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ. అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసి సర్వేపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. దీనికి కౌంటర్‌గా హిందూ సంస్థలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విచారణలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి. తమ వాదనలు వినకుండా తుది నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి. దీంతో మరోసారి జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది.

వారణాసిలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. అయితే ఈ మసీదు స్థానంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని.. 17వ శతాబ్దంలో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని పడగొట్టి దాని గోడలపైనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×