Big Stories

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!

Suspicious Kuwait Boat Near Gateway of India: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద పడవ కలకలం రేపింది. సముద్రంలో గస్తీ నిర్వహించే పోలీసులు.. మంగళవారం సాయంత్రం కువైట్ నుంచి ముంబైకి చేరుకున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. ఆ పడవులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ముగ్గురినీ ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్ ఆంటోనీగా గుర్తించారు. పోలీసులు అనుమానించిన ఆ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదు.

- Advertisement -

పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులూ మత్స్యకారులని, వీరు కువైట్ లో ఉన్న ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేలింది. తమ యజమాని పనిచేయించుకుని జీతం సరిగ్గా చెల్లించకపోగా.. చిత్రహింసలకు గురిచేసేవాడని, పాస్ పోర్టులు కూడా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు యజమాని పడవను దొంగిలించినట్లు చెప్పారు. 12 రోజులుగా పడవలో ప్రయాణిస్తూ వచ్చామని, రేషన్ అంతా అయిపోవడంతో.. నాలుగు రోజులుగా ఏమీ తినలేదని.. చాలా ఆకలితో ఉన్నామని వాపోయారు.

- Advertisement -

Read More : Bharat Rice : రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..

కాగా.. వారంతా సెక్యూరిటీని దాటుకుని.. తీరానికి పడవతో ఎలా చేరుకున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2008లో పాక్ ఉగ్రవాదులు కొందరు సముద్ర మార్గం ద్వారా.. ముంబైలోకి ప్రవేశించి మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా కువైట్ పడవ ఘటన.. సముద్ర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News