E-Paper
Advertisement

Tamilnadu Honour Killings : మరో పరువు హత్య.. కన్నకూతురినే దారుణంగా..

Tamilnadu Honour Killings : మరో పరువు హత్య.. కన్నకూతురినే దారుణంగా..
Advertisement

Tamilnadu Honour Killings : టెక్నాలజీలో అంతరిక్షాన్ని తాకుతున్నా కొన్ని నమకాలు పాతాళానికి తోసేస్తున్నాయి. దేశంలో పరువు హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఇలాంటి ఓ దారుణం చోటుచేసుకుంది. వేరే కులం యువకుడిని పెళ్లిచేసుకుందని కన్నతల్లి ఆరుముగకని..కూతరు అరుణను దారుణంగా హత్య చేసింది.

మృతురాలు అరుణ కోయంబత్తూర్‌లో నర్సింగ్ చదువుతోంది. అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో తల్లితండ్రులకు చెప్పింది. మంగళవారం తల్లి అరుముగకని కూతురు అరుణను ఇంటికి రమ్మని పిలిచింది. తమ కులంలోని యువకుడితో పెళ్లి సంబంధం చూసామని.. అతన్నే పెళ్లి చేసుకోమని తల్లి కూతురిని మందలించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మంగళవారం రాత్రి పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో కూతురు అరుణను కత్తితో గొంతు కోసి హత్య చేసింది అరుముగకని. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించింది. మృతురాలి తండ్రి, సోదరుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అరుణముకనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×