E-Paper
Advertisement

బస్సు ఎప్పుడు వస్తుంది? రైలు టైమింగ్ ఏంటి? ఈ Apple Mapsలోనే తెలుసుకోవచ్చు!

బస్సు ఎప్పుడు వస్తుంది? రైలు టైమింగ్ ఏంటి? ఈ Apple Mapsలోనే తెలుసుకోవచ్చు!
Advertisement

Apple Maps: భారత్‌లో ప్రజా రవాణా వినియోగించే ఐఫోన్ యూజర్లకు Apple Maps మరింత ఉపయోగకరంగా మారుతోంది. యాప్‌లో Transit సపోర్ట్ కనిపించడం ప్రారంభమైంది. దీంతో బస్సులు, రైళ్ల రూట్లు, బయలుదేరే సమయాలు, కనెక్షన్ల వివరాలను మ్యాప్స్‌లోనే చూసే అవకాశం లభించనుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు.

బస్సు, రైలు రూట్లు తెలుసుకోవచ్చు:

Transit ఫీచర్ ద్వారా గమ్యస్థానానికి చేరుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రజా రవాణా మార్గాలను Apple Maps చూపిస్తుంది. నగరం, రవాణా వ్యవస్థను బట్టి బస్సు లేదా రైలు వివరాలతో పాటు బయలుదేరే, చేరుకునే సమయాలు, కనెక్షన్ల సమాచారాన్ని కూడా చూడొచ్చు.

Advertisement

Also Read: పోకీమాన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. గూగుల్ కొత్త ఫిట్‌బిట్ వచ్చేసిందోచ్!

లైవ్ అప్‌డేట్స్‌తో మరింత ఉపయోగం:

సపోర్ట్ ఉన్న ప్రాంతాల్లో బస్సులు, రైళ్ల ఆలస్యం లేదా సర్వీస్‌లో అంతరాయాల గురించి రియల్‌టైమ్ సమాచారం కూడా అందే అవకాశం ఉంది. దీంతో ప్రయాణానికి ముందే పరిస్థితిని తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవచ్చు.

దగ్గర్లోని బస్సులు, రైళ్లు కూడా:

Advertisement

యాపిల్ మ్యాప్స్‌లో Transit Nearby ద్వారా ప్రస్తుత లొకేషన్ చుట్టూ ఉన్న ప్రజా రవాణా సదుపాయాలను చూడొచ్చు. ఆయా సర్వీసులు ఎప్పుడు బయలుదేరుతాయో తెలుసుకోవడంతో పాటు తరచు ఉపయోగించే ట్రాన్సిట్ లైన్లను సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

భారత్‌లో అందుబాటులో ఉందా?

ప్రస్తుతం ఈ ఫీచర్ భారతదేశంలో దశలవారీగా అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏ నగరాల్లో, ఏ రవాణా సంస్థల వివరాలు అందుబాటులో ఉంటాయనేది ఇంకా పూర్తిగా స్పష్టంగా లేదు. ట్రాన్సిట్ చెల్లింపుల సపోర్ట్ కూడా భారత్‌లో ఎంతవరకు పనిచేస్తుందనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా, ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఐఫోన్ యూజర్ల రోజువారీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణాలను మరింత సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.

Also Read: ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎక్కువైతే.. Wi-Fi స్లో అవుతుందా? టెక్ నిపుణులు ఏమంటున్నారంటే..

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×